Moviesఅనుష్క కంటే ముందే ప్రభాస్ ఆ హీరోయిన్ తో లవ్.. కృష్ణం...

అనుష్క కంటే ముందే ప్రభాస్ ఆ హీరోయిన్ తో లవ్.. కృష్ణం రాజు కి ఇష్టమైన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆరడుగుల అందగాడు ఆ హైటుకు తగ్గ వెయిట్..ఆ కటౌట్ చూసి ఎవ్వరైనా సరే పడిపోవాల్సిందే . అయితే చాలామంది ముద్దుగుమ్మలు ఈ ప్రభాస్ కటౌట్ కి పడిపోతుంటే ప్రభాస్ మాత్రం ఓ ముద్దుగుమ్మకు పడిపోయాడు. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేస్తున్నా ఇంకా పెళ్లి కావట్లేదు అన్న బాధ అభిమానులకు అలాగే ఉండిపోయింది .

గతంలో హీరోయిన్ అనుష్కతో పెళ్లి అంటూ వార్తలు వినిపించినా.. వాటిలో ఏమాత్రం నిజం లేదని అర్థం అయిపోయింది. అయితే ప్రభాస్ ..అనుష్కను ప్రేమిస్తున్నాడని త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని ఇప్పటికి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అయితే అనుష్క కంటే ముందే ప్రభాస్ మరో స్టార్ హీరోయిన్ ని ప్రేమించారన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ త్రిష.

త్రిష – ప్రభాస్ కలిసి చాలా సినిమాలో నటించారు. తీసిన ప్రతి సినిమా హిట్ అయింది. అంతే కాదు వీళ్ళ మధ్య కెమిస్ట్రీకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తెరపై ఈ జంట ఇంత అద్భుతంగా నటించడం వెనక వీళ్ళ ప్రేమాయణం ఉంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే కృష్ణంరాజుకు కూడా త్రిష అంటే ఇష్టమే అట . ఆమెతో పెళ్లికి కూడా ఒప్పుకున్నాడట. కానీ అదే టైంలో త్రిష మరొకరితో ఎఫైర్ నడుపుతుందని వార్త రావడంతో ప్రభాస్ ఆమెను మధ్యలోనే కట్ చేశాడు అన్న రూమర్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news