Moviesఈ ఐరెన్‌లెగ్ మ‌న‌కెందుకు... పూజా హెగ్డేకు టాలీవుడ్ స్టార్ హీరో వ‌ద్ద...

ఈ ఐరెన్‌లెగ్ మ‌న‌కెందుకు… పూజా హెగ్డేకు టాలీవుడ్ స్టార్ హీరో వ‌ద్ద ఘోర అవ‌మానం… !

బుట్ట బొమ్మ పూజ హెగ్డే కు ఈ ఏడాది ఘోరమైన అవమానాలు తప్పలేదు. పూజ స్టార్ హీరోయిన్ అయ్యాక ఈ ఏడాది అన్ని విధాల తీవ్రంగా నిరాశపరిచింది. అస‌లు పూజ ఈ యేడాదిని కెరీర్‌లో ఎప్పుడూ మ‌ర్చిపోలేనంత ఘోర‌మైన ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో పూజ నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.

అంతేకాకుండా ఈ ఏడాది భారీగా నష్టపోయిన డిజాస్టర్ సినిమాలలో ఇండియా వైడ్‌గా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా దెబ్బతో పూజ హెగ్డే కెరీర్ తలకిందులు అయిపోయింది. ఆ వెంటనే కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బీస్ట్ కూడా బొక్క బోర్లా పడింది. తెలుగు జనాలతో పాటు.. అటు తమిళ సినీ ప్రేక్షకులు సైతం పూజాహెగ్డే పెద్ద ఐరన్ లెగ్‌రా బాబు అని ముద్ర వేసేశారు.

ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కెరీర్లో తొలిసారి నటించిన మల్టీస్టారర్ మూవీ ఆచార్యతో ప్రేక్షకులను పలకరించింది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా పూజ నటించింది. అసలు ఈ సినిమా చిరంజీవి – రామ్ చరణ్ కు మాత్రమే కాకుండా మెగా అభిమానులకు పెద్ద పీడకలను మిగిల్చింది. చిరంజీవి కెరీర్ లో మృగరాజు లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయింది.

ఇంకా చెప్పాలంటే ఈ యేడాది పూజ ఎవ‌ర ప‌క్క‌న న‌టిస్తే వాళ్ల‌కు ఆ సినిమాల‌ అవ‌మానాలు జీవితంలో పీడ‌క‌ల‌గా మిగిలిపోయేలా ఉన్నాయి. ప్ర‌భాస్‌కు రాధేశ్యామ్‌, చ‌ర‌ణ్‌, చిరుకు ఆచార్య‌, విజ‌య్‌కు బీస్ట్ సినిమాలు అంత భ‌యంక‌ర ప్లాప్‌లు అయ్యాయి. ఇక ఎఫ్ 3 సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఈ సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. పైగా టిక్కెట్ రేట్లు త‌గ్గించామ‌ని డ‌ప్పులు కొట్టుకున్నా ఎఫ్ 3ను ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు.

ఇక ఈ యేడాది చివ‌ర్లో స‌ర్క‌స్ అనే హిందీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా ప్లాపే. ఇది కూడా ర‌ణ‌వీర్‌సింగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌. 2023లోనూ పూజాకు ఇదే ప‌రిస్థితి ఎదురైతే ఆమె కెరీర్ ఖ‌తం అయిన‌ట్టే. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం పూజ టాలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా అన్ని భాష‌ల్లోనూ ఐరెన్ లెగ్ అవ్వ‌డంతో ఆమెను త‌మ సినిమాలో పెట్టుకోవాల‌ని ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఓ స్టార్ హీరోకు రిక‌మెండ్ చేశాడ‌ట‌. పూజ వ‌ద్దు బాబోయ్ అని స్టార్ హీరో దండం పెట్టేశాడ‌ట‌.

Circus Song Sun Zara: Ranveer Singh, Pooja Hegde and Jacqueline Fernandez  स्टारर 'सर्कस' का नया गाना 'सुन जरा' हुआ रिलीज, सुन रहे हैं आपके भी गाने  लगेंगे पर ट्यून | Circus Song

దీనిని బ‌ట్టే పూజ త‌మ సినిమాలో ఉంటే అది ఎంత పెద్ద డిజాస్ట‌రో అన్న నిర్ణ‌యానికి స్టార్ హీరోలు కూడా వ‌చ్చేశారంటున్నారు. అయితే ఆమె చేతిలో ప్ర‌స్తుతం ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమా. ఈ సినిమా తేడా కొడితే పూజా కెరీర్ ముగియ‌డానికి పెద్ద టైం ప‌ట్ట‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news