Moviesబ్రేకింగ్‌: హీరో నితిన్‌కు విడాకులు...!

బ్రేకింగ్‌: హీరో నితిన్‌కు విడాకులు…!

టైటిల్ చూస్తేనే దిమ్మ‌తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయిన‌ట్లు ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో మాత్ర‌మే కాదు అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో చాలా మంది సినీ సెల‌బ్రిటీలు గ‌త రెండేళ్ల‌లో విడాకులు తీసుకుంటూనే వ‌స్తున్నారు. ఇప్పుడు నితిన్ విడాకులు తీసుకోబోతున్నాడా ? అన్న టైటిల్ చూస్తే చాలా మంది షాక్ అవుతారు. అయితే పైన టైటిల్ నిజ‌మే… అయితే అది సినిమాలో మాత్ర‌మే. నితిన్ రీల్ లైఫ్‌లో న‌టించే సినిమాలో భార్య‌కు విడాకులు ఇచ్చేసి ఒంట‌రిగా జీవించే భ‌ర్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

 

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ఛ‌లో, భీష్మ సినిమాల‌తో బ్లాక్‌బస్ట‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు వెంకీని మాంచి అభిరుచి ఉన్న డైరెక్ట‌ర్‌గా ఫ్రూవ్ చేశాయి. ఈ క్ర‌మంలోనే భీష్మ త‌ర్వాత వెంకీ కుడుముల నితిన్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మ‌ధ్య‌లో చిరంజీవితో కూడా వెంకీ చ‌ర్చ‌లు జ‌రిపాడు. చిరు ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో ఇప్పుడు తిరిగి నితిన్‌తోనే క‌మిట్ అయ్యాడు.

ఈ ప్రాజెక్టులో నితిన్ భార్య‌కు విడాకులు ఇచ్చేసి ఒంట‌రిగా జీవించే భర్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూర‌మై ఆ ఎడ‌బాటుతో జీవించే ఓ మ‌గాడి క‌థ‌గా వెంకీ చాలా ఫ‌న్నీగా ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడ‌ట‌. ఇప్ప‌టికే స్క్రిఫ్ట్ కూడా రెడీ అయ్యింద‌ని.. నితిన్‌కు కూడా సినిమా పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ? ఇక ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

భీష్మ ఎలాగూ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి భారీ వ‌సూల్లు సాధించింది. ఇటు మైత్రీ మూవీస్ బ్యాక‌ప్‌… అటు వెంకీ కుడుముల డైరెక్ష‌న్ అంటే ఈ క్రేజీ కాంబినేష‌న్ మామూలుగా ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news