Movies"మీ లాగా పక్కలేసి ..పక్కలోకి వెళ్లలేదు".. జబర్ధస్త్ కామెడియన్స్ పై శాంతి...

“మీ లాగా పక్కలేసి ..పక్కలోకి వెళ్లలేదు”.. జబర్ధస్త్ కామెడియన్స్ పై శాంతి స్వరూప్ సంచలన కామెంట్స్..!!

సాధారణంగా మన పక్క వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేరు కొందరు జనాలు . అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు . అలాంటి వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్. జబర్దస్త్ అనే కామెడీ షో లో పాపులారిటీ సంపాదించుకున్న శాంతి స్వరూప్ తనదైన స్టైల్లో పంచెస్ వేస్తూ కామెడీ డైలాగ్స్ ను అప్లై చేస్తూ ఫేమస్ అయ్యాడు . ఇప్పటికి జబర్దస్త్ లో కొనసాగుతున్న శాంతి స్వరూప్.. రీసెంట్గా తన ఇష్టమైన కారుని కొనుక్కున్న సంగతి తెలిసిందే .

ఈ క్రమంలోనే గతంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. గతంలో ఓసారి జబర్దస్త్ సెట్స్ పక్కన ఉన్న కారు దగ్గర నిల్చుని ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కొందరు నాపై వల్గర్ గా కామెంట్స్ చేశారని. ” నీ ఫేస్ కి అంత సీన్ ఉందా..? నీ బతుక్కి అలాంటి కారు కావాలా..? ఎవరి పక్కలో పడుకొని కార్ డబ్బులు సంపాదించుకున్నవ్..?” అంటూ వల్గర్ గా మాట్లాడారని.. జబర్దస్త్ కమెడియన్స్ సైతం అంతే నీచంగా నాపై కామెంట్స్ చేశారని ..ఆ కామెంట్స్ ని చదివి నేను చాలా బాధపడ్డాను అని ..ఈరోజు నా టైం వచ్చింది నా సొంత డబ్బులతో నేను కష్టపడి కొనుక్కున్న ఈ కారుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

అంతేకాదు నన్నెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ లాగా నేను పక్కలు వేసి.. పక్కలోకి వెళ్లి డబ్బులు సంపాదించుకోలేదని.. అలా అయ్యుంటే ఎప్పుడో నేను బంగ్లాలు, కార్లు కొనుక్కుని వాడినని కానీ నేను నిజాయితీగా జబర్దస్త్ లో కష్టపడి స్కిట్స్ వేసి డబ్బులు సంపాదించి కొనుక్కున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో  కార్లు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు శాంతి స్వరూప్ ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే శాంతి స్వరూప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news