Moviesబిగ్ బ్రేకింగ్: ఆగిపోయిన రవితేజ "ధమాకా" సినిమా రిలీజ్.. కొంప ముంచేసిన...

బిగ్ బ్రేకింగ్: ఆగిపోయిన రవితేజ “ధమాకా” సినిమా రిలీజ్.. కొంప ముంచేసిన డైరెక్టర్..!?

అయ్యయ్యో.. పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు .. భారీ అంచనాల నడుమ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కానున్న మాస్ మహారాజా రవితేజ మూవీ ధమాకాకు బిగ్ షాక్ ఎదురైంది . మనకు తెలిసిందే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ , అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధమాకా. మల్టీ టాలెంటెడ్ త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది .

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్ , పోస్టర్స్, పాటలు అభిమానులను భారీగా ఎక్స్పెక్ట్ చేసేలా చేసింది . ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ అంచనాలను నెలకొల్పింది. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ.. ” ఏంటి నీ ఉప్పర్ లొల్లి” అంటూ హేళన చేసి మాట్లాడారని ఆ సంఘం వారు మండిపడ్డారు” .

తమ కులస్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు . తెలంగాణ నగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు ఫిలిం ఛాంబర్ వద్ద ఆందోళన చేశారు . అంతేకాదు డైరెక్టర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు నినాదాలు చేస్తూ రచ్చ రచ్చ చేశారు .ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడిన మాటలకు సారీ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ బైఠాయించారు . ఈ క్రమంలోని రవితేజ నటించిన ధమాకా సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి చిక్కుల్లో పడటం సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news