Moviesదిమ్మ‌తిరిగే ట్విస్ట్ రివీల్‌: ' వీర‌సింహారెడ్డి ' లో బాల‌య్య ట్రిపుల్...

దిమ్మ‌తిరిగే ట్విస్ట్ రివీల్‌: ‘ వీర‌సింహారెడ్డి ‘ లో బాల‌య్య ట్రిపుల్ రోల్‌…!

న‌ట‌సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 12న విజయ్ వారసుడు – అజిత్ తెగింపు సినిమాలకు పోటీగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా వీరసింహారెడ్డి రిలీజ్ అవుతుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ? చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే రిలీజ్ అయిన జై బాలయ్య జై జై బాలయ్య సాంగ్ తో పాటు – సుగుణసుందరి సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నాయి.

ఈ రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో వీరసింహారెడ్డికి ప్రి రిలీజ్ బజ్‌ అదిరిపోతుంది. ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే ఓ షాకింగ్ ట్విస్ట్‌ బయటికి వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రభినయం చేస్తున్నారని… అందులో ఒకటి రాయలసీమలో ఉండే వీర సింహారెడ్డి పాత్ర అయితే… మరొకటి అమెరికా నుంచి వచ్చే బాల‌సింహారెడ్డి పాత్ర అంటూ ప్రచారం జరిగింది.

అయితే తాజా అప్డేట్ ప్రకారం బాలయ్య మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఫ్యాన్స్ కు త్రిపుల్ ధమాకా అన్నమాట. ఈ మూడు పాత్రల‌లో ఒకటి గ్రామ పెద్దగా కనిపించగా… రెండోది మోడరన్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూడో పాత్ర‌ను మూవీ మేకర్స్ సస్పెన్స్ గా ఉంచినట్టు తెలుస్తోంది. అది సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే రివీల్ అయ్యేలా సీక్రెట్‌గా ఉంచుతున్నార‌ట‌.

ఇక మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ – కన్నడ నటుడు దునియా విజయ్ కీలకపాత్రల‌లో కనిపించనున్నారు. థ‌మన్ స్వరాలు అందించారు. ఇక ఈ సినిమా నుంచి స్పెష‌ల్ సాంగ్‌ మా బావ మనోభావాలు సాంగ్ కూడా త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news