Moviesబాల‌య్య వీర‌సింహా రిలీజ్‌కు ముందే మ‌రో సంచ‌ల‌నం... న‌ట‌సింహం తాండ‌వ‌మే...!

బాల‌య్య వీర‌సింహా రిలీజ్‌కు ముందే మ‌రో సంచ‌ల‌నం… న‌ట‌సింహం తాండ‌వ‌మే…!

సంక్రాంతి బరిలో టాలీవుడ్ లోనే ఇద్దరు సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోటీ పడుతున్నాయి. బాలయ్య – చిరంజీవి సినిమాలు సంక్రాంతికి పోటీ పడితే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం ఎలా ? ఉంటుందో చాలాసార్లు చూశాం. ఈ క్రమంలోనే మరోసారి అద్భుతమైన రసవత్తరమైన పోటీ మనం చూడబోతున్నాం. ఇక ఈ రెండు సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్ లు ఉన్నాయి.

ఇప్పటికే అనేక విషయాల్లో వీరయ్య‌, వీర‌సింహారెడ్డి పోటీపడుతుండగా… ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ విషయంలోనూ ఈ రెండు సినిమాలలో ఏ సినిమాలో ?స్పెషల్ సాంగ్ పై చేయి సాధిస్తుందన్న ఆసక్తి ఉంది. ఇప్పటికే వాల్తేరు వేరే సినిమా నుంచి బాస్ వేర్ ఈజ్‌ పార్టీ పేరుతో రిలీజ్ అయిన పాట యూట్యూబ్ ను షేర్ చేస్తోంది. అయితే ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా బయటికి వచ్చింది.

మెగాస్టార్ సినిమా స్పెషల్ సాంగ్‌కు బాస్ పార్టీ అని పేరు పెడితే బాలయ్య సినిమాలోని స్పెషల్ సాంగ్‌కు ‘ మా బావ మనోభావాలు ‘ అన్న పేరు పెట్టారు. మా బావ మ‌నోభావాలు స్పెష‌ల్ సాంగ్ క్రిస్మస్ కానుకగా.. ఈనెల 24న ఈ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఇక చిరంజీవి బాస్ పార్టీ పాటలో బాలీవుడ్ ముద్దుగమ్మ ఊర్వశి రౌతేలా ఆడి పాడింది. లిరికల్ వీడియోలో ఆమె అందచందాలు హైలెట్‌గా నిలిచాయి.

రౌతేలా చిరంజీవితో పోటీపడి మరి డ్యాన్స్ వేసింది. ఇక ఇప్పుడు బాలయ్య మా బావ మనోభావాలు పాటలో చంద్రిక రవి మెరుపులు తళుక్కుమన్నాయి. ఆమె ఇప్పటికే రెండు మూడు తమిళ సినిమాలలో నటించింది. ఇండియాలో పుట్టి ఆస్ట్రేలియాలో పెరిగిన చంద్రికకు తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ బ్యూటీ కూడా బాలయ్య స్పెషల్ సాంగ్ కు మంచి కిక్‌ తీసుకురాబోతుంది.

ఇక ఇప్ప‌టికే జై బాల‌య్య‌.. జైజై బాల‌య్య సాంగ్‌, సుగుణ సుంద‌రి సాంగ్స్ రెండూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిపోయాయి. ఇప్పుడు మూడో సాంగ్ మా బావ మ‌నోభావాల‌కు కూడా మంచి టాక్ వ‌చ్చేసింది. రిలీజ్‌కు ముందే బాల‌య్య వీర‌సింహారెడ్డి ఏ రేంజ్‌లో దుమ్ము రేపుతుందో చెప్పేందుకు ఇవే నిద‌ర్శ‌నం కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news