Moviesర‌వితేజ‌తో ఆ కార‌ణంతోనే గ్యాప్ వ‌చ్చింది... న‌య‌న‌తార బ‌య‌ట పెట్టిన సీక్రెట్‌..!

ర‌వితేజ‌తో ఆ కార‌ణంతోనే గ్యాప్ వ‌చ్చింది… న‌య‌న‌తార బ‌య‌ట పెట్టిన సీక్రెట్‌..!

సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. పెళ్లయ్యాక కూడా సినిమాలు ఆపని నయనతార అటు ఫ్యామిలీ లైఫ్ తో.. పాటు ఇటు సినిమా లైఫ్ బ్యాలెన్స్ చేస్తోంది. ఇక రీసెంట్గా సరోగసి విధానంతో నయనతార బిడ్డకు జన్మనిచ్చింది. సరోగసి విషయంలోనే నయనతార వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన కనెక్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అసలు మీడియా ముందుకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడిన నయనతార.. తాజాగా తెలుగు హీరోల మీద తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

తనతో పని చేసిన హీరోల గురించి నయనతార చెప్పిన విషయాలు ఇప్పుడు అందరు హీరోల అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆ హీరోల అభిమానులు కూడా నయనతారపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నయనతార తెలుగులో రవితేజ – ప్రభాస్ – ఎన్టీఆర్ – బాలయ్య – చిరంజీవి – వెంకటేష్ – నాగార్జున ఇలా అందరి హీరోలతోనూ నటించింది. ప్రభాస్ అయితే చిన్నపిల్లల లాంటివాడిని… సెట్స్ లో ఎప్పుడు అల్లరి చేస్తూ… అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడని న‌య‌న్‌ తెలిపింది. అలాగే ప్రభాస్ చాలా మంచి వాడిని కూడా ప్రశంసలు కురిపించింది.

ఇక తనకు ఉన్న ఫ్రెండ్స్ లో రవితేజ మంచి ఫ్రెండ్ అని… అయితే ఇటీవల తమ ఇద్దరికీ కాస్త గ్యాప్ వచ్చిందని న‌య‌న్ చెప్పింది. అయితే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో ? కారణం కూడా నయనతార చెప్పింది. రవితేజ తన పనులు… తన సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడని.. తాను కూడా తన సినిమాలు, తన పనులతో బిజీగా ఉండడంతో.. ఇప్పుడు కాస్త గ్యాప్ వచ్చిందని తెలిపింది. అయితే తాము ఇద్దరం కలిసి పనిచేసిన సమయంలో మాత్రం చాలా సరదాగా ఉండే వాళ్ళమని న‌య‌న్ తెలిపింది.

తనతో రవితేజ ఎక్కువగా హిందీలో మాట్లాడేవాడిని… ఎక్కువగా జోక్స్ వేస్తూ నవ్వించేవాడిని కూడా న‌య‌న్ తెలిపింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ ఎప్పుడు ? రిహార్స‌ల్‌ చేసింది లేదు… డ్యాన్స్ మూమెంట్స్ చేద్దామా ? అని అడిగితే నేను చేయను కావాలంటే నువ్వు చెయ్ అనే వాడిని నయ‌న్‌ చెప్పింది. రిహార్స‌ల్స్ చేయకుండా డ్యాన్స్ అంత గొప్పగా చేయగలిగిన ఏకై హీరో ఎన్టీఆర్ మాత్రమే అని మెచ్చుకుంది. ఇక బాలయ్య కూడా నైస్ అని, మంచి వ్య‌క్తి అని న‌య‌న్ ఆకాశానికి ఎత్తేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news