Moviesఅన‌సూయ అందం సీక్రెట్ అదేన‌ట‌.. ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ ప‌క్కా..!

అన‌సూయ అందం సీక్రెట్ అదేన‌ట‌.. ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ ప‌క్కా..!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ అనసూయ. ముఖ్యంగా యూత్ లో అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమయ్యారు. ఈ షో తో అనసూయ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రాళ్ళ మతి పోగొట్టారు. జబర్దస్త్ లో వేసే కామెడీ పంచలను వినడంతో పాటు అనసూయ అందాలను చూడటానికి ఈ షో ను ఎక్కువమంది చూసేవారు. యాంక‌ర్ గానే కాకుండా రంగస్థలం సినిమాలో రంగమ్మ‌త్త పాత్ర‌లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ సినిమా తర్వాత అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. రంగమ్మత్త పాత్రలో నటనతో పాటు అనసూయ వయ్యారాలను వ‌ల‌క‌పోసింది. ఇక మరోసారి సుకుమార్ దర్శకత్వంలో అనసూయ పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. అయితే మొదటి నుంచి అనసూయ అందానికి ఎక్కువమంది ఫ్యాన్స్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఓ సందర్భంలో అనసూయ తన బ్యూటీ సీక్రెట్ ను సోష‌ల్ మీడియాలో బయటపెట్టింది. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మీరు కూడా తెలుసుకోండి. అనసూయ ప్రతిరోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తాన‌ని చెప్పింది.

అంతేకాకుండా రాత్రి భోజనానికి బదులు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగుతానని…. అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాన‌ని చెప్పింది. అవే త‌న బ్యూటీ సీక్రెట్స్ అంటూ సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ చెప్పింది. అయితే ఈ హెల్త్ టిప్స్ కోసం అన‌సూయ‌ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. నిజానికి రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదని ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుందని పేర్కొంది. అదేవిధంగా ఆకలిగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు కాబట్టి ఆ సమయంలో రాత్రి నిద్రపోయే ముందు రెడ్ వైన్ తీసుకుంటాన‌ని అనసూయ వెల్లడించింది.

అయితే ఈ చిట్కా అందరికీ వర్కౌట్ అవ్వదని.. తనకు బాగా పనిచేసిన చిట్కా వేరే వాళ్లకు పనిచేయకపోవచ్చు అని చెప్పింది. ఎవరి శరీర తత్వాలు వారివి. దాన్ని అనుసరించి ఏదైనా చేయాలంటే వివరంగా చేయాలి అంటూ అన‌సూయ వివ‌రంగా త‌న అందం సీక్రెట్ చెప్పింది. ఇదిలా ఉంటే అనసూయ ఒక్క‌సారి మాత్రమే కాకుండా అనేకసార్లు వైన్ గ్లాస్ పట్టుకుని తాగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news