Moviesఅనుష్కను కాదనుకొని సమంత దగ్గరకొస్తే.. నిండా ముంచేసేలా ఉందా..?

అనుష్కను కాదనుకొని సమంత దగ్గరకొస్తే.. నిండా ముంచేసేలా ఉందా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా గుణశేఖర్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కో కథ చాలా విభిన్నంగా తయారు చేసుకునే ఆయన సినిమాను కూడా అంతే విభిన్నంగా తెరమీద చూపిస్తుంటారు. మ‌నోహ‌రం – చూడాల‌ని ఉంది – ఒక్క‌డు – రుద్ర‌మ‌దేవి సినిమాలు గుణ‌శేఖ‌ర్ వైవిధ్యం ఏంటో చెపుతాయి.
గుణశేఖర్ కెరీర్‌లో హిట్స్ కంటే కూడా ఫ్లాపులెక్కువున్నాయి. అయినా ఆయనకున్న స్థానం మాత్రం ఇంకెవరూ భర్తీ చేయలేదు. చూడాలని ఉంది సినిమాను తీయడం పెద్ద సాహసం అని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాను మళ్ళీ మార్చి తీయాలంటే కత్తిమీద సాము చేసినట్టే. అయినా తీసి సూపర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత చేసిన మనోహరం సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయినా కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన లయకి మాత్రం అవార్డు దక్కింది. కథ, స్క్రీన్ ప్లే రాయడంలో గుణ స్టైలే వేరు. ఇక ఆయన సినిమా అంటే ఖచ్చితంగా కళ్ళు చెదిరే భారీ సెట్టింగ్స్ ఉండాల్సిందే.

చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ లాంటి సినిమాలు ఎంత గ్రాండియర్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అనుష్క శెట్టి, రానా, అల్లు అర్జున్ లాంటి అగ్ర తారలతో తీసిన రుద్రమదేవీ అద్భుతంగా ఉంటుంది. ఇందులో అనుష్కకి చాలామంచి పేరొచ్చింది. అయితే, ఇప్పుడు ఆయన శాకుంతలం అనే సినిమాను రూపొందిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో శకుంతల పాత్రకి గానూ, అనుష్కనే తీసుకోవాలనుకున్నారట.

 

కానీ, అనుష్క బాహుబలి, సైజ్ జీరో సినిమాల దెబ్బ‌కు భారీగా తయారవడం వల్ల గుణశేఖర్ వద్దనుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. సైజ్ జీరో సినిమాతో అనుష్క షేప్ మొత్తం మారింది. దీనివల్ల చాలావరకూ తనవరకూ రావాల్సిన అవకాశాలు రావడం లేదు. అలా మిస్సైన సినిమాలలో శాకుంతలం కూడా ఉందట.

అయితే, సమంత ఈ ప్రాజెక్ట్‌ను బాగా ప్లస్ అవుతుందని గుణ టీం భావించింది. కానీ, అదే సమయంలో నాగ చైతన్యతో గొడవల కారణంగా సమంత చాలా పేలవంగా మారింది. దీంతో పాటు విడాకుల త‌ర్వాత స‌మంత కెరీర్ మ‌రోలా టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆమెలో మునుప‌టి ఛ‌రిష్మా లేదు. ఆ ప్రభావం వల్ల శాకుంతలం సినిమాకి సమంత మైనస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news