Moviesరణబీర్-అలియా లైఫ్ లో మరో గుడ్ న్యూస్ .. అభిమానులకు బిగ్...

రణబీర్-అలియా లైఫ్ లో మరో గుడ్ న్యూస్ .. అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన కొత్త జంట..!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. స్టార్ హీరో రణబీర్ కపూర్.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట డేటింగ్ కూడా చేశారు . కాగా ఇప్పటికే రెండు, మూడు సార్లు వివాహం ముహూర్తం ఫిక్స్ చేసుకొని కొన్ని అనివార్య కారణాల కారణంగా తమ పెళ్లినిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట …ఎట్టకేలకు ఏప్రిల్ లో కుటుంబ సభ్యుల మధ్య ఏడడుగులు నడిచి ఒకటయ్యారు.

కాగా ఎవరు ఊహించని విధంగా రణబీర్ కపూర్- అలియా కపుల్స్ పెళ్లయిన రెండు నెలలకే ..మూడో నెల అంటూ గుడ్ న్యూస్ వినిపించారు. దీంతో బాలీవుడ్ జనాలు ఈ రోజుల్లో ఇలాంటి మ్యాటర్ అంతా చాలా కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. రీసెంట్ గానే ఆలియా భట్ పండంటి పాపకు జన్మనిచ్చింది. లైఫ్ లో కొత్త పర్సన్ ఎంటర్ అవ్వగానే వాళ్ళ లైఫ్ మొత్తం దశతిరిగిపోయినట్లు తెలుస్తుంది.

ఎప్పటినుంచో వాళ్ళిద్దరూ ఇష్టపడి కాపురం పెట్టాలి అనుకున్న ఓ విల్లాను ఈ జంట కూతురు పుట్టిన శుభ సందర్భంగా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తమ ఇద్దరు ఎంత ఇష్టపడి దక్కించుకోవాలి అనుకున్న ఆ విల్లా పై కోర్టు కేసు నడుస్తూ ఉండేదని.. కూతురు పుట్టిన వేళ విశేషం .. ఆ కేస్ ని కోర్టు కొట్టేసింది. దీంతో తరతరాలుగా కపూర్ ఫ్యామిలీ చేయలేనీ పని నెరవేరింది. త్వరలోనే తమ ముద్దుల కూతుర్ని తీసుకొని ఆ విల్లాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే అలియా చిన్న పాప రాకతో రణబీర్ లైఫ్ లో మరొక గుడ్ న్యూస్ విడనిపించింది . దీంతో అలియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news