Moviesఎట్టకేలకు..కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్నా.. ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా...

ఎట్టకేలకు..కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్నా.. ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా సామీ..!!

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు తమన్నా కెరీర్ క్లోజ్ అయిపోయిందని ఇప్పటికే 40 ప్లస్ కు చేరువైన తమన్నా ఇక పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల కోరిక నెరవేర్చబోతుంది అంటూ పెద్ద పెద్ద వెబ్ సైట్స్ కూడా వార్తలు రాసుకోచ్చాయి . దీంతో యూట్యూబ్లో తమన్నాకు సంబంధించిన కొన్ని ఫోటో స్ తో ఓ రేంజ్ లో డబ్బులు సంపాదించుకున్నారు కొందరు ఫేక్ యూటూబర్స్.

ఈ క్రమంలోని తమన్నా అలా యూట్యూబ్లో ..తనపై వార్తలు రాసే వాళ్ళకి.. తన పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళకి ఇచ్చి పడేసింది. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆ తర్వాత మంచి మంచి సినిమా అవకాశాలు అందుకొని బిగ్ బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని ..బడాబడా హిట్ లను తన ఖాతాలో వేసుకుంది . అంతేనా ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. ప్రజెంట్ టైం క్లోజ్ అయినట్టు తెలుస్తుంది .

పెరిగిపోతున్న యంగ్ బ్యూటీల అందాలకు తమన్న హాట్ అందాలు కాంపిటీటివ్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే తమన్నకు అవకాశాలు తగ్గిపోయాయి. కాగా రీసెంట్ గా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో తమన్నా తన పెళ్లిపై కామెంట్ చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అంతే దీంతో ఒక్కసారిగా తమన్న పెళ్లి ఫిక్స్ అయిపోయిందని.. ఆమె కాబోయే వరుడు ముంబైలో పెద్ద బిజినెస్ మాన్ అని ..కాకపోతే అతనికి ఓ భారీ లోపం ఉందని బాలీవుడ్ లో రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఇలాంటి న్యూస్ పై తమన్న స్పందించింది తమన్నా . తన పెళ్లి అంటూ ప్రచారం చేస్తున్న వాళ్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది . “ఇంట్రడ్యూసింగ్ మై బిజినెస్ హస్బెండ్”.. అంటూ తన బాయ్ గెటప్ పిక్ ని షేర్ చేసింది. అంతేకాదు తన పెళ్లి అంటూ ప్రమోట్ చేసిన వాళ్లని కూడా టాగ్ చేసింది. అంతేనా “మ్యారేజ్ రూమర్స్.. ప్రతి ఒక్కరు నా లైఫ్ గురించి రాసేస్తున్నారు.. రా బాబోయ్ “అంటూ తన పెళ్లి పై వస్తున్నా వార్తలు అన్ని ఫేక్ కంటూ చెప్పగానే చెప్పేసింది మిల్కీ బ్యూటీ. మరి తమన్న పెళ్లెప్పుడు చేసుకుంటుందో ..? ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో ..?వెయిట్ చేసి చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news