Moviesబిగ్ బాస్ 6: ఫైమా ని కావాలనే తొక్కేస్తున్నారా..? ఇంతకన్నా నీచం...

బిగ్ బాస్ 6: ఫైమా ని కావాలనే తొక్కేస్తున్నారా..? ఇంతకన్నా నీచం మరోకటి ఉందా..?

ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడే కొద్ది బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లో ఫైర్ యమ రేంజ్ లో పెరిగింది . ఇన్నాళ్లు తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా ..అన్న కాన్సెప్ట్ ని ఫాలో అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ఇప్పుడు కప్పు కొట్టాలన్న కసితో తొక్కలో స్ట్రాటజీ లు ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు . కాగా ఇన్నాళ్లు హౌస్ లో ఉన్నామా లేదా అని అటెండెన్స్ వేయించుకున్న కంటెస్టెంట్లు సైతం ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడేకొద్దీ నిద్ర మేల్కొని టాస్క్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . అదే అంటున్నారు రీసెంట్ ఎపిసోడ్ చూసిన జనాలు.

రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్స్ కి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇస్తూ ఇస్తూనే బిగ్గెస్ట్ మెలిక పెట్టాడు. దీంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ తమ ఓన్ ఐడియాలను బయటకు తీసుకొచ్చాడు. మరి ముఖ్యంగా కెప్టెన్సీ పోటీకి కంటెండర్స్ గా ఉన్న ఈ టాస్క్ లో జబర్దస్త్ కమెడియన్ పై ఫైమాకు తీవ్ర అన్యాయం జరిగింది అంటున్నారు ఫ్యాన్స్. గార్డెన్ లో బిబి ట్రాన్స్ పోర్ట్ అనే వెహికల్ ఆగి ఉంటుంది. ఆ వెహికల్ ని ఎవరైతే ముందుగా చేరుకొని హార్న్ మోగిస్తారో వారు కెప్టెన్సీ టాస్క్ పోటీకి ఎంపిక అవుతారు. అంతేకాదు మిగిలిన వాళ్ళందరిలో ఒకరిని కెప్టెన్సీ టెండర్ కాకుండా ఆపవచ్చు .

అందరూ ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవాలి . కాగా ఇలా అందరికంటే ముందుగా ఆదిరెడ్డి హారన్ మోగించి కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తాడు . అయితే ఆదిరెడ్డి తన గేమ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ మొదటి రౌండులోనే టఫ్ కంటెస్టెంట్ అయిన ఫైఅమాను టాస్క్ నుంచి తప్పిస్తాడు. దీంతో ఒక్కసారిగా మండిపడుతుంది ఫైమ. ఇలా నన్ను మొదటి రౌండ్ లోనే తొలగించేస్తే నా గేమ్ నేను ఎలా ఆడాలి ..నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటూ ఫైర్ అవుతుంది.

అంతేకాదు నా గేమ్ కావాలని తొక్కేస్తున్నారు కొందరు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది . కేవలం ఫైమానే కాదు షో చూస్తున్న జనాలకి అదే అనిపించింది. నిజానికి ఫైమా ప్రతి టాస్క్ లోను ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . కాగా ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడే టైం లో ఇలా పైమాను అన్ని విషయాల్లో అవాయిడ్ చేస్తూ అందరూ టార్గెట్ చేస్తే ఎలా ..? ఫైమాను కావాలనే కొందరు తొక్కేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం అంటున్నారు షో చూస్తున్న జనాలు. ఇలా అన్ని రౌండ్స్ పూర్తయ్యేసరికి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆదిరెడ్డి ,రేవంత్, రోహిత్ శ్రీహాన్, ఇనయా వీళ్ళల్లో ఆదిరెడ్డి రేవంత్ తప్పిస్తే మిగతా అందరూ డమ్మీ అన్న సంగతి అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news