Moviesపొట్టోడు అంటూ నానితో సినిమా ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.....

పొట్టోడు అంటూ నానితో సినిమా ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. అంత తలపొగరా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నానికి ఎలాంటి ప్రత్యేకమైన పేరు ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. న్యాచురల్ గా నటిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి చిన్న హీరోగా ..ఆ తర్వాత స్టార్ హీరోగా మారి ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ టెన్ హీరోలల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నాడు . అంతేకాదు ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటించే నాని అంటే జనాలకు మహా ఇష్టం. కాగా ప్రజెంట్ నాని దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు .

కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది . ఈ సినిమా కోసం నాని ఓ రేంజ్ లో కష్టపడుతున్నారు. అంతే కాదు నాచురల్ లుక్స్ తో ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ..ఫస్ట్ సింగిల్ బాగా ఆకట్టుకుంటుంది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారట. అయితే ఈ సినిమాలో నాని సరసన నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందన్న వార్త సంచలనంగా మారింది.

నాని చూడడానికి పొట్టిగా ఉంటాడు . అది అందరికీ తెలిసిందే. అయితే యాక్టింగ్ మాత్రం ఇరగదీస్తాడు . హీరోయిన్గా ఉన్నటువంటి ఓ ముద్దుగుమ్మ నాని దసరా సినిమాలో ఆఫర్ వస్తే ఆయన పొట్టిగా ఉంటాడు ..ఆయన పక్కన నేను నటించను అంటూ రిజెక్ట్ చేసిందట . అంతేకాదు మాస్ యాంగిల్ లో సినిమాను నేను చేయ్యను అంటూ నాని ను చులకనగా చేసి అతను స్టార్ హీరో కాదు అన్నలాగా కామెంట్స్ చేసిందట. దీంతో నాని ఫాన్స్ ఎంత పొగరు ఆ హీరోయిన్ కి అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే నాని లాంటి హీరో పక్కన ఛాన్స్ వదులుకొని ఆ స్టార్ ముద్దుగుమ్మ తప్పుడు వేసింది అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news