Moviesఉప్పెన కంటే ముందే ఆ మెగా హీరో తో ఛాన్స్...

ఉప్పెన కంటే ముందే ఆ మెగా హీరో తో ఛాన్స్ అందుకున్న కృతి.. ఎందుకు రిజెక్ట్ చేసారంటే..?

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. అంతకన్నా బాగా నటిస్తుంది . కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించే టాలెంట్ ఉన్న ఈ కన్నడ బ్యూటీ .. వయసుకు మించిన హావ భావాలను అచ్చు గుద్దినట్లు దింపేస్తుంది . కాగా మొదట చిన్న యాడ్స్ లో కనిపించిన ఈ కృతి శెట్టి ..ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో హీరోయిన్గా నటించి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

ఈ సినిమా తర్వాత కృతశెట్టి పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత నటించ్చిన రెండు సినిమాలతో హిట్ అందుకుంది. ప్రజెంట్ కృతి కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్నా సరే త్వరలోనే పుంజుకుంటుంది అన్న నమ్మకాలు అందరికీ ఉన్నాయి. అయితే నిజానికి కృతిశెట్టికి ఉప్పెన సినిమా కంటే ముందే ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. అది కూడా మెగా హీరోతోనే . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా కోసం యంగ్ బ్యూటీ ని తీసుకోవాలనే ఆలోచనలు సుకుమార్ ఉండగా.. అప్పుడు కొత్త హీరోయిన్స్ కోసం ట్రై చేశారట .

ఈ క్రమంలోనే కృతి శెట్టి ఫొటోస్ సైతం సుకుమార్ చూశాడని.. కానీ రామ్ చరణ్ పక్కన కృతిశెట్టి బాడీ అందగించదు అని అప్పటికి ఆమె ఏజ్ చాలా చిన్నదని హీరోయిన్గా కాదని రిజెక్ట్ చేశాడట . అంతేకాదు కృతి శెట్టి కొంచెం ఎదిగాక ఇండస్ట్రీని షేక్ చేసే హీరోయిన్ అవుతుందని ముందుగానే చెప్పేసాడట . అలా మెగా హీరోతో ఎంట్రీ మిస్ అయినా సరే మెగా మేనల్లుడుతో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకునుంది కృతి శెట్టి. చూడాలి మరి మెగా హీరోతో చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందో ఈ ముద్దుగుమ్మకు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news