Moviesమ‌హేష్‌బాబుకు అత్త‌ను కావాలంటోన్న రోజా... చీ అంటోన్న నెటిజ‌న్లు...!

మ‌హేష్‌బాబుకు అత్త‌ను కావాలంటోన్న రోజా… చీ అంటోన్న నెటిజ‌న్లు…!

టాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం లెజెండ్రీ హీరోల్లో ఒక‌రు అయిన సూప‌ర్‌స్టార్ కృష్ణ అంద‌రిని దుఖః సాగ‌రంలో ముంచేసి వెళ్లిపోయారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనూ అటు త‌ల్లి ఇందిర‌ను, ఇటు తండ్రిని కోల్పోయిన టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబును ఓదార్చ‌డం ఎవ్వ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. ఇక ఈ యేడాది జ‌న‌వ‌రిలోనే మ‌హేష్ అన్న ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్‌బాబు కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. ఇలా ఈ యేడాదిలో ఈ ఇంట్లో మూడు పెద్ద విషాదాలో చోటు చేసుకోవ‌డం మ‌హేష్‌కు తీర‌ని లోటే.

మ‌హేష్ కూడా త‌న‌కు ఇన్ని ల‌క్ష‌ల మంది అభిమానుల‌తో పాటు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చిన త‌న తండ్రి మ‌ర‌ణం ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నాడ‌ట‌. మ‌హేష్ దుంఖాఃన్ని కూడా ఆప‌డం ఎవ్వ‌రి వ‌ల్లా కావ‌డం లేద‌ని తెలుస్తోంది. సినిమా ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ‌, పారిశ్రామిక రంగాల‌కు చెందిన ఎంతో మంది ప్ర‌ముఖులు కృష్ణ భౌతిక‌ఖాయ‌న్ని సంద‌ర్శించి నివాళులు అర్పించ‌గా.. ఇప్ప‌ట‌కీ కంటిన్యూగా మ‌హేష్ ఇంటికి వ‌చ్చి ప‌రామ‌ర్శించ‌డంతో పాటు ధైర్యం చెపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే నిన్న‌టి ప్ర‌ముఖ సినీన‌టి, ఏపీ మంత్రి రోజా కూడా ప‌ద్మాల‌యా స్టూడియోకు వ‌చ్చి కృష్ణ‌కు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కృష్ణ‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. తాను కృష్ణ‌గారితో కొన్ని సినిమాల్లో న‌టించాన‌ని.. ఆ టైంలో కృష్ణ గారు సెట్స్‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే తాను ఆయ‌న్నే చూస్తూ టైం గ‌డిపే దానిని అని రోజా తెలిపారు.

ఇండ‌స్ట్రీలో శ‌త్రువులు లేని హీరో కృష్ణ అని.. అల్లూరి సీతారామ‌రాజు పేరు విన‌ప‌డితేనే మ‌న‌కు ఆయ‌న రూప‌మే గుర్తుకు వ‌స్తుంద‌ని చెప్పారు. ఇక మ‌హేష్‌బాబు గురించి మాట్లాడుతూ త‌న‌కు మ‌హేష్ బాల్యం నుంచే తెలుసు అని… అయితే మ‌హేష్‌బాబుకు అత్త‌గా న‌టించాల‌ని ఉంద‌న్న త‌న మ‌న‌సులో కోరిక‌ను ఆమె బ‌య‌ట పెట్టారు. రోజా చేసిన కామెంట్లు, ఆమె కోరిక త‌ప్పేం కాక‌పోయినా.. ఆమె ఆ మాట అన్న సంద‌ర్భం, చెప్పిన ప్లేస్ క‌రెక్ట్ కాద‌ని ఇప్పుడు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

కొంద‌రు అయితే రోజా చీ ఈ టైంలో ఇలా మాట్లాడ‌డం ఏంట‌ని కామెంట్ చేస్తున్నారు. అయితే మ‌హేష్‌పై త‌న కోరిక‌ను ఆమె మ‌రో సంద‌ర్భంలో చెప్పి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news