Moviesఅమ్మ-నాన్న చనిపోయినా గుండు కొట్టించుకోని మహేశ్.. అసలు కారణం తెలిస్తే దండం...

అమ్మ-నాన్న చనిపోయినా గుండు కొట్టించుకోని మహేశ్.. అసలు కారణం తెలిస్తే దండం పెట్టేస్తారు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు .. ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే . మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు.. తీవ్ర శోకసంద్రంలో ఉండిపోయారు . సినిమా విషయాలను పక్కన పెట్టేసి .. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు . మనకు తెలిసిందే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కొన్ని నెలల ముందే మరణించారు . ఆ మరణ విషాద ఛాయలు మరవకముందే .. మహేష్ బాబు తండ్రి కృష్ణ అనారోగ్య కారణంగా మరణించారు . ఇలా వరుసగా మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు పోగొట్టుకోవడం మహేష్ జీవితంలోనే చాలా బాధాకర అంశం గా చెప్పుకోవచ్చు.

అంతేకాదు మహేష్ బాబు తల్లిదండ్రులు పోగొట్టుకున్న బాధ నుంచి ఇంకా బయటికి రాలేదు . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు తల్లిదండ్రులు మరణించినప్పటికీ ఆయన ఎందుకు హిందూ సాంప్రదాయ ప్రకారం గుండు కొట్టించుకోలేదు అంటూ ఓ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. సాంప్రదాయ ప్రకారం.. ఎవరైనా సరే తల్లిదండ్రులు మరణిస్తే కొడుకులు తలనీలాలు సమర్పించాలి .. ఆ తర్వాతే కర్మ కాండలను పూర్తి చేయాలి. అది హిందూ సాంప్రదాయం ..తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా వస్తున్న చరిత్ర చెబుతున్న పాఠం ఇది .

అయితే మహేష్ బాబు మాత్రం తలనీలాలను సమర్పించలేదు . గుండు కొట్టించుకోలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అన్ని సాంప్రదాయ ప్రకారం చేసిన మహేష్ బాబు గుండు మాత్రమే ఎందుకు కొట్టించుకోలేదు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే ఘట్టమనేని కాంపౌండ్ నుంచి క్రేజీ మ్యాటర్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుతో మహేష్ నటిస్తున్న మూవీ సెట్స్ పై ఉంది. ఒకవేళ మహేష్ బాబు గుండు కొట్టించుకుంటే కచ్చితంగా మూడు , నాలుగు నెలలు సినిమా షూట్ వాయిదా పడాల్సిందే.

అంతే కాదు ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లోనూ మహేష్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకి కూడా మహేష్ బాబు హెయిర్ చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలోనే కొంచెం కష్టం గా అనిపించినప్పటికీ మహేష్ బాబు తన తలనీళాలను సమర్పించలేదు అంటూ న్యూస్ వైరల్గా మారింది. అంతే కాదు మహేష్ బాబు రియల్ హెయిర్ కాదు ..చాలా సహజంగా కనిపించే క్యూ6 టెక్నాలజీతో జుట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ కారణాల వల్ల మహేష్ బాబు తల్లిదండ్రులు మరణించినా సరే గుండు కొట్టించుకోలేదు అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news