Moviesనడవలేని స్థితిలో నరకం చూస్తున్న జబర్దస్త్ కమెడియన్..ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

నడవలేని స్థితిలో నరకం చూస్తున్న జబర్దస్త్ కమెడియన్..ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . టాలెంట్ ఉన్న ఎంతోమంది కమెడియన్స్ రోడ్డుపైన జీవనం లేక అల్లాడుతుంటే పిలిచి ఆఫర్ ఇచ్చి వాళ్లలోని టాలెంట్ను జనాలకు చూపించి. తిండికి గతి లేని వాళ్లను ఇప్పుడు కార్లలో బంగ్లాల్లో తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేసేలా చేసింది ఈ జబర్దస్త్ షో. ఈ విషయం నెటిజెన్సీ కాదు స్వయానా అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కమెడియన్స్ సైతం చెప్పుకొస్తున్నారు.

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే , రీసెంట్గా బుల్లితెరపై తనదైన శైలిలో పంచులు విసిరి పాపులారిటీని సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో హెల్తీ కామెడీని పండిస్తూ వల్గర్ పంచస్ లేకుండా హోమ్లీ డైలాగ్స్ తో ఆకట్టుకుంటాడు . కాగా జబర్దస్త్ లోకి ఎంటర్ అయిన తర్వాత పంచ్ ప్రసాద్ పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అయితే కొన్ని నెలలకే ఆయన జబర్దస్త్ నుండి కనుమరుగు కావడం చర్చనీయాంశం గా మారింది. ఈ క్రమంలోనే అతనికి హెల్త్ బాగోలేదని జబర్దస్త్ జడ్జెస్ గా ఉన్న నాగబాబు, రోజా కొంచెం ఆర్థిక సహాయం చేసి అతని లైఫ్ అతడి హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

కాగా రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆపరేషన్ చేయించుకొని మళ్లీ ఆరోగ్యం సెట్ చేసుకొని జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో నవ్వించాడు. కొన్ని రోజుల నుంచి పంచ్ ప్రసాద్ జబర్దస్త్ లో కనిపించడం లేదు . ఈ క్రమంలోని ఆయనకు సంబంధించిన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది. ఒక హెల్ప్ లేకుండా లేవలేకపోతున్నాడు . మంచానికే పరిమితం అయిపోయాడు . దీంతో ఆయన ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఏదో పర్సనల్ రీజన్ వల్ల రాలేకపోయాడు ఏమో కానీ ..మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తాడు అంటూ ఆశలు పెట్టుకున్న వాళ్ళకి లేటెస్ట్ విజువల్స్ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ఆఖరికి తన పనులు తాను కూడా చేసుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాడు ప్రసాద్ . రీసెంట్గా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, ఆసియా ఇద్దరు కలిసి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో కాళ్ళు వాచిపోయి నడవలేని పొజిషన్లో ఉన్నాడని.. పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఆర్థిక సహాయం కోసం వేచి చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సరే తన కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్వించే పంచ్ ప్రసాద్ ఇలా కన్నీళ్లు పెట్టుకొని నడవలేని స్థితిలో ఉండడం చాలా బాధాకరం . ఎవరైనా దాతలు దయ తలచి ఆయన ఆరోగ్యానికి సరిపడా డబ్బులు దానంగా ఇస్తే బాగుండు బాగుండు అంటూ ఫ్యాన్స్ ఆయన ఆరోగ్య పరిస్థితి అందరికి తెలియజేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news