Moviesకూతురు చెత్త పని..అనుమానంతో శ్రీదేవి ఏం చేసిందో తెలుసా..!

కూతురు చెత్త పని..అనుమానంతో శ్రీదేవి ఏం చేసిందో తెలుసా..!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబర్స్ హోమ్ టూర్స్ అంటూ తమ ఇంట్లోని వస్తువులను ..ఎక్కడ ఏమీ అమర్చుకుంటారో క్లియర్ గా చూపిస్తున్నారు . అంతేనా కొందరు యూట్యూబర్స్ ఎక్కడ ఏం పెట్టుకుంటారో క్లియర్గా చూపిస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో దొంగలకి ఓ ఆస్కారం ఇస్తున్నట్లు కొందరు మండిపడుతున్నా.. పాపులారిటీ కోసం స్టార్స్ సైతం ఇదే రూట్ ను ఎంచుకున్నారు . రీసెంట్గా జాన్వీ కపూర్ టాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు తన అమ్మగారు ఫస్ట్ సంపాదనతో కొనుక్కున్న ఇల్లును హోం టూర్ చేసి.. అభిమానులకు చూపించింది.

రీసెంట్ గా జాన్వీ కపూర్ శ్రీదేవి కి ఎంతో ఇష్టమైన హోమ్ టూర్ రూపంలో అభిమానులకు చూయించింది. ఈ క్రమంలోనే జాన్వి చేసిన వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అంతేకాదు ఆ ఇంటితో తన తల్లికి ఎలాంటి అనుబంధం ఉందో గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .కాగా ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఈ ఇల్లు ..శ్రీదేవి కొన్ని కోట్లు ఖర్చు చేసి అప్పట్లోనే తనకి ఇష్టమైన విధంగా మార్చుకునిందట.

అంతేకాదు ఇంట్లోని ప్రతి వస్తువును తనకి ఇష్టమైన విధంగానే డిజైన్ చేయించుకొని ..అమర్చుకునిందట. ఏది ఏమైనా సరే శ్రీదేవి ఎంత స్టార్ సెలబ్రిటీ అయినా కనీసం నెలకి ఒక్కసారైనా బ్రేక్ తీసుకొని ఇల్లు మొత్తం తానే శుభ్రపరుచుకునేదట . మరీ ముఖ్యంగా శ్రీదేవికి పెయింటింగ్స్ అంటే చాలా చాలా ఇష్టమట . అందుకే ఆమె ఇంట్లో ఎక్కడైనా సరి పెయింటింగ్స్ ని అమర్చడానికి ఇష్టపడుతుందట . కాగా ఇదే టైం లో జాన్వీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయట పెట్టింది.

తన బెడ్ రూమ్ చూపిస్తూ ఓ సీక్రెట్ ను చెప్పేసింది . ఈ ఇంట్లో ఉన్నా నా రూంలో బాత్రూం కు లాక్ ఉండదు ఎందుకని మీకు డౌట్ రావచ్చు.. మా అమ్మకి నా మీద అనుమానం ..నేను బాత్రూంలోకి వెళ్లి అబ్బాయిలతో ఎక్కడ గంటలు గంటలు మాట్లాడుతానో అని ఓ సందేహం. అందుకే లాక్ పెట్టించలేదు . ఇప్పటికి దీనికి లాక్ లేదు. మా అమ్మని నేను చాలా మిస్ అవుతున్నాను. నేను చాలా సార్లు అడిగాను. లాక్ పెట్టించు అని కానీ ఒప్పుకోలేదు అంటూ జాన్వి నవ్వుతూ చెప్పుకొచ్చింది. మొత్తానికి కూతురుపై ఉన్న అనుమానంతో శ్రీదేవి ఇలాంటి పనులు కూడా చేసిందా అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే శ్రీదేవి లేని లోటు జాన్వి కపూర్ కి ఎవరు తీర్చలేనిది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news