Moviesఆ నొప్పి భరించలేకపోయా.. తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ ..స్టార్ డాటర్ సంచలన...

ఆ నొప్పి భరించలేకపోయా.. తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ ..స్టార్ డాటర్ సంచలన కామెంట్స్..!!

స్టార్ డాటర్ జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . అతిలోకసుందరి శ్రీదేవి కూతురు గా బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వి.. మొదటి సినిమా తర్వాత వచ్చిన అన్ని సినిమాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి . ఈ క్రమంలోనే ఆమె నటించిన “మిలి” సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బాలీవుడ్ జనాలు.

ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి . జాన్వికపూర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఈ సినిమాలో నేను బిఎస్ నర్సింగ్ విద్యార్థిగా కనిపిస్తాను. దీనికోసం నా పూర్తి బాడీని మేకవర్ చేసుకున్నాను. అంతేకాదు దర్శకుడు సూచన మేరకు నేను నిజంగానే బరువు పెరిగాను. దాదాపు ఈ పాత్ర కోసం నేను 8 కేజీల పెరిగాను”.

ఈ క్రమంలోనే ఫుడ్ బాగా తినేశాను. అంతేకాదు ఈ సినిమా మంచు గడ్డల్లో చిత్రీకరించాము. నేచురల్ గా ఉండాలని చెప్పి డైరెక్టర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు ఆ ఐస్ కి మార్నింగ్ షూటింగ్ చేశాక ఇంటికి వెళ్లి నైట్ పడుకునే టైం కి బాడీ పెయిన్స్ కి నిద్ర రాలేదు. అదృశ్యాలు నా కళ్ళల్లోకి వచ్చేవి ..దీంతో నిద్ర రావడానికి పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకున్నాను. నేను పోషించిన పాత్ర మొత్తం ఫ్రిడ్జ్ లో ఉంటుంది. రోజున 15 గంటలు ఫ్రీజర్ లో ఉండాల్సి వస్తే అక్కడ ఓ ఎలుక మీ వేలను కొరుకుతూ ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాకు మెయిన్ పాయింట్. మీకు నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో జాన్వి ఈ సినిమా కోసం బాగా కష్టపడిన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news