Moviesపుష్ప 2 : పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చిన బన్నీ.."నీ యవ్వ...

పుష్ప 2 : పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చిన బన్నీ..”నీ యవ్వ ఇక తగ్గేదేలే”..!!

గతేడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫుల్ మాస్ లెంత్ గ్లామర్ హీరోగా నటించి అభిమానులను మెప్పించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన రష్మిక మందన కెరియర్ ఎలా తిరిగిపోయిందో మనకు తెలిసిందే. ప్రజెంట్ రష్మిక మందన బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా ఏడు సినిమాల్లో నటిస్తోంది.

ప్రజెంట్ ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సుకుమార్ సన్నహాలు చేస్తున్నారట . కాగా ఇప్పటికే పుష్ప2 షూటింగ్ ప్రారంభించిన సుకుమార్ వన్ కి మించిపోయే రేంజ్ లో పుష్ప 2 లో మరింత మాస్ యాంగిల్ ను పెంచే విధంగా డైరెక్ట్ చేస్తున్నాడట. రీసెంట్గా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్ష్శివో సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో బన్నీ మాట్లాడుతూ ..పుష్ప 2 కి సంబంధించిన క్రేజీ డైలాగ్ ను లీక్ చేశాడు.

మరి ముఖ్యంగా పుష్ప వన్ లో పుష్ప పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పటికీ ఆ తగ్గేదేలే అనే డైలాగ్ పూనకాలు తెప్పిచ్చేస్తుంది . అల్లు అర్జున్ మాట్లాడుతూ..” నన్ను ఎక్కడికి వెళ్లిన అందరూ పుష్ప2 గురించి అడుగుతున్నారు. వారికోసం ఓ చిన్న అప్డేట్ ఇస్తాను . పుష్పవన్ తగ్గేదేలే అయితే పుష్పట్టు అసలు తగ్గేదేలే ఇరగ తీయడమే ..నేను కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్ మెంట్ గా వెయిట్ చేస్తున్నాను “అంటూ జనాలకి పూనకాలు తెప్పించే డైలాగ్ ను లీక్ చేశాడు . దీనితో ఒక్కసారిగా పుష్ప2 సినిమాపై బోలెడని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news