Movies'తు..తూ' మొహానే ఊసిన సిగ్గులేదా..? ఫస్ట్ టైం టంగ్ స్లిప్ అయిన...

‘తు..తూ’ మొహానే ఊసిన సిగ్గులేదా..? ఫస్ట్ టైం టంగ్ స్లిప్ అయిన ఫైమా..!!

భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి మరింత రసవత్తరంగా సాగుతుంది. మరీ ముఖ్యంగా ఎనిమిదో వారం హౌస్ లో నుంచి ఫైర్ బ్రాండ్ గలాట గీతూ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. మనకు తెలిసిందే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరుగా ఉన్న గీతూ హౌస్ నుండి ఎలిమినేట్ అయినా తరుణంలో ఏడ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . నాగార్జున సైతం ఆమె ఏడుపును తీసుకోలేకపోయారు. దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ సముదాయించాడు. కాగా నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్ లో ఇనయ – ఫైమ ల మధ్య మాటలు హద్దులు దాటిపోయాయి . మరీ ముఖ్యంగా ఎప్పుడు కంట్రోల్ గా ఉండే ఫైమా ఫస్ట్ టైం హద్దులు మీరి టంగ్ స్లిప్ అయ్యి ఇనయా పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

నిజానికి సూర్య ఎలిమినేట్ అయిన మూమెంట్ నుంచి ఇనయాకు బాగా కలిసి వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లే అయింది. మరీ ముఖ్యంగా సూర్య ఎలిమినేట్ అయ్యాక హౌస్మెట్స్ అందరూ ఆమెనే టార్గెట్ చేయడం ..ఆమె వాటిని తిప్పికొడుతూ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం.. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇనయా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది . కాగా రీసెంట్గా ఈ వారం హౌస్ లో ఏకంగా ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఆమెను నామినేట్ చేశారు . కాగా ఫైమ ఆమెను నామినేట్ చేయకపోయినా ఇనయా మాత్రం ఆమెను చేసింది .

దీనితో ఒక్కసారిగా వీళ్లిద్దరి మధ్య మాటలు హద్దులు మీరాయి. ఫైమని ఎందుకు నామినేట్ చేస్తున్నానో చెప్పిన ఇనయ రీజన్ ఫైమాకు నచ్చలేదు. ఇనయా మాట్లాడుతూ..”మొన్న చేపల చెరువు టాస్క్ లో మరీనా మరియు బాల ఆదిత్య చేపలు కాపాడుకుంటున్న సమయంలో ఒకరి మీద ఒకరు ముందు నువ్వు ఆ పడుకోండి పడుకోండి అంటూ కామెంట్ చేసావ్. అది నాకు అస్సలు నచ్చలేదు” అంటూ చెప్పుకొచ్చింది. నీ మైండ్ సెట్ అంతేనా నీకు తెలుగు రాదా అంటూ రెచ్చిపోయింది . నీకు నిజంగా తెలుగు రాకపోతే నేర్చుకో. ఒక కంటెస్టింగ్ మీద ఇలా లేనిపోని ఆరోపణలు చేసి ఆడుకోవడం నీ ఆట అయితే అది వేస్ట్.. నువ్వు ఫేక్ అంటూ మండిపడింది. దీంతో ఇనయ సైతం నువ్వు ఫేక్ అంటూ రివర్స్ కౌంటర్ చేసింది . ఈ క్రమంలోనే మాట మాట పెరిగి ఫైమ ఒక్కసారిగా ఇనయాను తూ తూ అంటూ అనేసి వెళ్ళిపోయింది . అయితే అలా అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎంత రెచ్చగొట్టినా సరే బిగ్ బాస్ హౌస్ లో కంట్రోల్ గా ఉండాలని సరిగ్గా కుదిరితే ఈ సీజన్ కప్పు కొట్టేది ఫైమాని అంటున్నారు జనాలు. మరొకొంతమంది ఎన్ని సార్లు ఊసిన ఇనయాకి సిగ్గురాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news