Moviesచరణ్ కి ఆ మెగా హీరో అంటే అంత కోపామా.. ఇంటికి...

చరణ్ కి ఆ మెగా హీరో అంటే అంత కోపామా.. ఇంటికి వచ్చినా పలకరించడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఎవరి హెల్ప్ లేకుండా వచ్చి నార్మల్ హీరో నుంచి స్టార్ హీరోగా ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని స్థాయిని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ ఓ ప్రత్యేకమైన గౌరవం . ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కొందరైతే ..ఆయన పేరుతోనే ఇండస్ట్రీలో బ్రతుకుతున్న వారు మరికొందరు .

అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఒక్కచోట సెలబ్రేట్ చేసుకునే మెగా ఫ్యామిలీ .. లోలోపల ఎన్నో గొడవలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి అస్సలు పడడం లేదని ..తూ తూ మంత్రంగా మొక్కుబడిగా మీడియాకు ఫోజులిస్తున్నారని ఓ న్యూస్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా మెగా హీరో వరుణ్ తేజ్ కి , చరణ్ కు క్షణం కూడా పడడం లేదంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

మొదటి నుంచి చరణ్ కి వరుణ్ తేజ్ కు అస్సలు పడదట. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉండేవారట . అది చిన్నతనంలో సరదా అనుకొని లైట్గా తీసుకున్న చిరంజీవి – నాగబాబు పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు ఇన్నర్ గా ఎక్కువగా ఈగో పెంచేసుకొని ఒకరి మీద ఒకరికి లేనిపోని గ్రడ్జ్ పెట్టుకున్నారట. ఈ క్రమంలోనే చరణ్ – వరుణ్ తేజ్ మద్య వార్ మరింత ముదిరిపోయినట్లు తెలుస్తుంది . అంతేనా ఇంటికి వస్తే కనీసం ప్రేమగా పలకరించడట. అమ్మ చెప్పడం కారణంగా మొక్కుబడిగా పలకరిస్తాడట ..ఏది ఏమైనా అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఫైట్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news