Moviesఅలా చేస్తే చెప్పుతో కొడతా.. అల్లు హీరో కి వార్నింగ్ ఇచ్చిన...

అలా చేస్తే చెప్పుతో కొడతా.. అల్లు హీరో కి వార్నింగ్ ఇచ్చిన తండ్రి..!!

ఊర్వశివో రాక్షశివో సినిమాతో ఫస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న అల్లు శిరీష్ .. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అరవింద్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శిరీష్ ..మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా అల్లు శిరీష్ కి మంచి పేరు తీసుకురాలేదు. శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా హిట్ పాజిటివ్ టాక్ ని సంపాదించుకున్న ఆ క్రెడిట్ మొత్తం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఖాతాలో వేసుకుంది.

దీంతో అల్లు శిరీష శూన్యం అయిపోయాడు. ఏం చేయాలో దిక్కుతో పొజిషన్లో ఏకంగా కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయిన అల్లు శిరీష్ ఈ మధ్యనే ఊర్వశివో రాక్షసివో అంటూ రొమాంటిక్ హిట్ నూతన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమాలో అల్లు శిరీష్ పెర్ఫార్మెన్స్ బాగుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం ఆయనను పొగిడేస్తారు. అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ సినిమాలు హద్దులు మీరు నటించిన అల్లు శిరీష్ లోని రొమాంటిక్ యాంగిల్ సూపర్ అంటూ అమ్మాయిలు సైతం ఆయనకు హ్యూజ్ ఫాన్స్ గా మారిపోయారు.

ఈ సినిమా సక్సెస్ ఆయన సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తన ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అల్లు శిరీష్. ప్రపంచానికి తెలియని మరో అన్న గురించి కూడా బయట పెట్టాడు . కాగాఈ క్రమంలోనే అల్లు అరవింద్ ..శిరీష్ ను చెప్పుతో కొడతాను అన్న మాట ఎందుకు అన్నారో కూడా క్లారిటీ ఇచ్చాడు .

“నేను మా నాన్నని కారు కొనియమని అడిగాను . అందరూ నాన్నలు 21 దాటగానే కారు కొనిస్తున్నారు. అల్లు అర్జున్ , రామ్ చరణ్ కి 21 ఏళ్లు నిండిన తర్వాత కారు గిఫ్ట్ గా ఇచ్చారు. నాకు కూడా గిఫ్ట్ గా కారు కొనివ్వండి అని అడిగాను. అంతేకాదు మా నాన్న తీసి ఇవ్వననేసరికి పలాన ప్రొడ్యూసర్ కొడుక్కి కారుంది నాకు కూడా తీసివ్వు అంటూ కంపేర్ చేసి అడిగాను . దీంతో ఒక్కసారి ఫైర్ అయిపోయిన మా నాన్నగారు చెప్పుతో కొడతాను ..నాకెంత ఇవ్వాలో తెలుసు ..అంతే ఇస్తాను ..మిగతాది నీ డబ్బులు నువ్వే సంపాదించుకో ..కష్టపడి సంపాదించు అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో నాకు డబ్బులు విలువ తెలియదు . అందుకే ఆయన అలా తిట్టారు ..ఆ తర్వాత నాకు డబ్బు విలువ తెలిసిన అప్పుడు మా నాన్నగారు ఎందుకు నన్ను తిట్టారో నాకు అర్థమైంది “అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటికీ బడ్జెట్ విషయాల్లో వాళ్ళ నాన్నగారు స్టృఇక్ట్ గా ఉంటారు అంటూ చెప్పుకోచాడు శిరీష్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news