Moviesనాగ‌శౌర్య‌కు కాబోయే భార్య ఎవ‌రు... ఆమె బ్యాక్‌గ్రౌండ్‌కు ఎన్టీఆర్‌కు లింక్ ఉందా...!

నాగ‌శౌర్య‌కు కాబోయే భార్య ఎవ‌రు… ఆమె బ్యాక్‌గ్రౌండ్‌కు ఎన్టీఆర్‌కు లింక్ ఉందా…!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్గా కృష్ణ వ్రింద‌ విహారి సినిమాతో మంచి సక్సెస్ కొట్టి జోష్లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయ్యాక మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇక టాలీవుడ్‌లో ఉన్న బ్యాచిలర్ హీరోలలో ఒకడిగా ఉన్న నాగశౌర్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నాగశౌర్యకు కొద్ది రోజులుగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు నాగశౌర్య కర్ణాటకకు చెందిన అనూష శెట్టిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

బెంగుళూరులోని JW మారియట్ హోటల్లో నాగశౌర్య అనూష శెట్టి వివాహం నవంబర్ 19, 20వ తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. నవంబర్ 19న ఫ్రీ వెడ్డింగ్ మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు పెళ్లి ఉంటుంది. ఈ రెండు వేడుకలకు చాలా స్పెషల్ గా డ్రెస్సులు కూడా డిజైన్ చేసుకుంటున్నాడు నాగశౌర్య. రెండు రోజులపాటు చాలా వేడుకగా బెంగళూరులో గ్రాండ్‌గా పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఎప్పటికీ చాలామంది బ్యాచ్‌ల‌ర్ హీరోలు ఉన్నారు. నాగశౌర్య ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి పలికి ఓ ఇంటివాడు అవుతుండడంతో… శౌర్యకు కాబోయే భార్య ఎవరు ? ఏమిటి అన్న విషయం తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. నాగశౌర్య‌కు కాబోయే భార్య అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఆమెకు ఈ రంగంలో ఎంతో గొప్ప అనుభవం ఉంది.

ఆమె న్యూయార్క్ స్కూల్ ఆఫ్‌ ఇంటీరియ‌ల్ డిజైన్స్‌ నుంచి ప‌ట్టా పొందారు. ఎంట‌ర్ ప్రెన్యూర్ షిఫ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. బెంగ‌ళూరులో ఆమెకు ఓన్ అనూష శెట్టి ఇంటీరియ‌ల్ డిజైనింగ్ అనే కంపెనీ కూడా ఉంది. ఈ సంస్థ‌కు ఆమే ఎండీ. అంతే కాకుండా 2019లో ఆమె డిజైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతే కాదు 2020లో దేశంలోనే టాప్ 40 ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ల‌లో ఆమె ఒక‌రిగా నిలిచారు.

ఇలా చాలా చిన్న వ‌య‌స్సులోనే ఆమె ఎన్నో ఘ‌న‌త‌లు సాధించారు. ఈమె కర్ణాటకలోని కుందాపూర్ ప్రాంతానికి చెందినవారు కుందాపూర్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని స్వస్థలం అంటే జూనియర్ ఎన్టీఆర్ అమ్మమ్మ ఊరే నాగశౌర్యకు కాబోయే భార్య ఊరు అలా వీరిద్దరికి చిన్న కరెక్షన్ కుదిరిందని చెప్పాలి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news