Moviesవావ్: అభిమానులకు గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న మరో యంగ్ నటుడు..!!

వావ్: అభిమానులకు గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న మరో యంగ్ నటుడు..!!

కోలీవుడ్ స్టార్ హీరో , తెలుగు హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి తడ్రి కాబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి ..ఇంత త్వరగా గుడ్ న్యూస్ చెప్తాడు అని ఊహించలేకపోయారు ఫ్యాబ్స్. హీరోయిన్ నిక్కీ గల్రానీ తో కల్సీ సినిమా చేస్తున్న టైంలోనే ..ప్రేమ లో పడిన ఈ యంగ్ హీరో..ఆ తర్వాత వీళ్ల ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా కొన్నాళ్లు సీక్రేట్ గా మెయిన్ టైన్ చేసారు.

ఆ తరువాత లైఫ్ లో సెటిల్ అయ్యాక.. ఫైనల్ గా ఇంట్లో పెద్దలను ఒప్పించి ..అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు . అబ్బో వీళ్ళ పెళ్లి టైం నడిచిన హంగామా అంతా ఇంతా కాదు . అయితే ఒకటి మాత్రం నిజం, అందరి హీరో, హీరోయిన్స్ ల ఆది పినిశెట్టి తన పెళ్లి పిక్స్ ను దాచుకోలేదు . అభిమానుల కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వచ్చాడు ఆది. వీళ్ల పెళ్లి కి సంబంధించిన బ్రైడల్ ఫోటోషూట్ ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే.

కాగా పెళ్లి తర్వాత వివిధ కంట్రీస్ కి హనీ మూన్ వెళ్లిన ఈ జంట.. అభిమానులకు ,ఇంట్లోని పెద్దలకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తుంది. నిక్కీ గల్రానీ ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news