Moviesలావ‌ణ్య త్రిపాఠి లైఫ్‌లో ప్రేమ‌, పెళ్లితో పాటు ఇన్ని కాంట్ర‌వ‌ర్సీలు ఉన్నాయా..!

లావ‌ణ్య త్రిపాఠి లైఫ్‌లో ప్రేమ‌, పెళ్లితో పాటు ఇన్ని కాంట్ర‌వ‌ర్సీలు ఉన్నాయా..!

లావణ్య త్రిపాఠి.. పుట్టింది యూపీలోని డెహ్రాడూన్ అయినా ముంబైలో చదువులు పూర్తిచేసింది. చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టం ఉన్నా తండ్రి కోసం డిగ్రీ పట్టా పొందింది. ఒక వైపు చదువుకుంటూనే మోడలింగ్ లో ప్రవేశించి స్కూల్ లో ఉన్న సమయంలోనే మిస్ ఉత్తరాఖండ్ గా ఎంపికయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాల్లో నటించాలని ట్రై చేసిన సీరియల్స్ ఆమెను పలక‌రించడం తో హిందీ టెలివిజన్ రంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగులో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా మారింది. ఇక భారత నాట్యం కూడా నేర్చుకున్న లావణ్య అందాల రాక్షసి సినిమా హిట్ కావడంతో ఫుల్ టైం సౌత్ హీరోయిన్ గా మారింది.

ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే సీరియల్స్ లో హడావిడి చేసిన లావణ్య సిఐడి షోలో సాక్షి పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక లావణ్య కెరీర్లో చేసిన సినిమాలు తక్కువే అయినా వివాదాలకు మాత్రం కొదవ లేదు. ఆమె కెరీర్లో ఎదుర్కొన్న ఆ వివాదాలు ఏంటో ఒకసారి చూద్దాం.

నిషేధం :
2017 లో 100% లవ్ సినిమాను రీమేక్ చేయడానికి లావణ్య త్రిపాఠి ఒప్పుకొని సైన్ చేసి చివరి నిముషంలో హ్యాండ్ ఇవ్వడంతో దర్శకుడు – నిర్మాత సౌత్ ఇండియాన్ ఫిలిం కార్పొరేషన్ కంప్లైంట్ చేయగా ఆమెపై నిషేధం విధించాలని అసోసియేషన్ తీర్మానం చేసింది. కానీ ఆ తర్వాత ఆ నిషేధం ఎత్తివేసినా తెలుగు సినిమాల్లో తప్ప ఆమె మిగతా భాషల్లో నటించలేదు.

ప్రేమ వివాదం :
మెగా హీరో వరుణ్ తేజ్ తో చాల రోజులుగా ప్రేమలో ఉందంటూ లావణ్య త్రిపాఠిపై వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరు ఈ వార్తలను ఖండించకపోవడంతో ప్రేమ విషయం నిజమే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు మొదలై చాల రోజులు గడుస్తున్నా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అయితే ఇవి నిజామా కాదా ? అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

పెళ్లి :
ఇక లావణ్య త్రిపాఠి తనను పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయింది అంటూ ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానెల్స్ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌గా అతడి పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకొని నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ వివాదం అతడు క్షమాపణలు చెప్పడం తో ముగిసిపోయింది. ఇక అంతటితో ఆగకుండా మూడు సార్లు గర్భవతి కూడా అయ్యిందంటూ హద్దులు దాటి మాట్లాడాడు సదరు వ్యక్తి.

బ్రాహ్మణులపై వ్యాఖ్యలు :
లావణ్య త్రిపాఠి స్వయంగా ఒక బ్రాహ్మణా కుటుంబలో జన్మించింది. అయినా బ్రాహ్మణ కమ్యూనిటీ లో ఎందుకో కొంత మంది తాము గొప్ప వాళ్ళం అనే భావంతో ఉంటారని తనకు ఈ విషయం అసలు అర్ధం కాదని వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు మనం చేసే పనుల వల్ల‌ మాత్రమే మనం గొప్పవారు అవుతాం కానీ పుట్టిన కాస్ట్ కారణంగా కాద‌న‌డం కూడా కాంట్ర‌వ‌ర్సీకి కార‌ణ‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news