Moviesఇంట్రెస్టింగ్..ఆ విషయంలో కుర్ర హీరోయిన్లు కంట్రోల్ చేసుకోలేక పోతున్నారా..?

ఇంట్రెస్టింగ్..ఆ విషయంలో కుర్ర హీరోయిన్లు కంట్రోల్ చేసుకోలేక పోతున్నారా..?

సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరోయిన్ ని ఏ విధంగా చూస్తారో మనకు తెలిసిందే. సమాజంలో డబ్బు ఉన్న మనుషుల్ని ఎంత గౌరవంగా చూస్తారో.. డబ్బు లేని జనాలను అంత చీదరించుకుంటారు . అలాగే సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరోయిన్ ను దేవతల చూస్తారు. ఫ్లాపులు తెచ్చుకుంటున్న హీరోయిన్ ను దరిద్రం అంటూ దూరం పెడతారు. ప్రస్తుతం ఇదే మాటలతో బాధపడిపోతుంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. మనకు తెలిసిందే ఈ కన్నడ బ్యూటీ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది .

అమ్మడు అదృష్టమో లేక స్క్రిప్ట్ వర్క్ ప్రభావమో తెలియదు కాని మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు అలాగే హిట్ అయ్యాయి. దీంతో కృతిశెట్టిని అదృష్ట దేవత అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. అయితే ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో కృతిశెట్టి కెరియర్ డౌన్ అయింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కృటిశెట్టి తో సినిమా అంటే భయపడిపోతున్నారు. కాగా దీనికి ప్రధాన కారణం కృతి శెట్టి పెట్టే కండిషన్స్ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం కృతిశెట్టి నే కాదు యంగ్ బ్యూటీస్ అందరూ కూడా సినిమాల విషయంలో కొన్ని కండిషన్లు పెడుతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళల్లో కృతి శెట్టి టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలానికి టాప్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అవ్వాలని తొందర తో ఆ కోరికలను కంట్రోల్ చేసుకోలేక యంగ్ బ్యూటీస్ చేతికి వచ్చిన స్క్రిప్ట్ ను సైన్ చేయడం వాళ్ళ కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ అవుతుంది. నిజానికి కృతిశెట్టి మొదటి సినిమాలో చేసిన రొమాన్స్ కి రెండో సినిమాలో చేసిన రొమాన్స్ కి చాలా తేడా ఉంది . మొదటి సినిమాలో పద్ధతిగా అనిపించిన రొమాన్స్ రెండో సినిమాలో వల్గారిటీగా ఉండింది.


కేవలం కృతి శెట్టి ఏ కాదు మరో యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా అదే తప్పు చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలానికే టాప్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వాలని తనకంటే వయసులో డబుల్ కన్నా పెద్దయిన మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాలో రొమాన్స్ చేయడానికి సిద్ధపడింది. ఈ జంటను తెరపై చూసిన అందరూ అన్నాచెల్లెళ్ల ఉనారు అంటున్నారు. అంతేకాక ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాలో మహేష్ బాబుకి మరదలుగా చేయడానికి సిద్ధపడిందంటూ తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ యంగ్ బ్యూటీస్ స్టార్ హీరోయిన్ అయిపోవాలన్న తొందరలో ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక తప్పటడుగులు వేస్తున్నారు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news