Newsఅన్‌స్టాప‌బుల్ విత్ NBK పై అదిరే స్టిల్ వ‌చ్చేసింది... ఫ్యీజులు ఎగిరే...

అన్‌స్టాప‌బుల్ విత్ NBK పై అదిరే స్టిల్ వ‌చ్చేసింది… ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌..!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అల్లు అర‌వింద్‌కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షో గ‌తేడాది వ‌చ్చింది. అఖండ సినిమా రిలీజ్‌కు ముందు ఈ టాక్ షో ఆహాలో ప్ర‌సార‌మైంది. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీల‌తో ఆ టాక్ షో ర‌న్ చేశారు. ఫ‌స్ట్ ఎపిసోడ్ మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో స్టార్ట్ కాగా దుమ్ము రేపేసింది.

 

అస‌లు తెలుగు బుల్లితెర‌పై ఓ స్టార్ హీరో ఈ రేంజ్‌లో టాక్ షో స‌క్సెస్ చేస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 తో మళ్ళీ ఎంటర్‌టైన్ చేసేందుకు బాల‌య్య రెడీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే చ‌రిత్ర‌లోనే లేని విధంగా ఓ టాక్ షోకు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. రేపు విజ‌య‌వాడ‌లో జ‌రిగే ఈ ఈవెంట్‌కు ఏకంగా 30 వేల మంది హాజ‌ర‌వుతున్నారు. ఈ టీజ‌ర్ అప్‌డేట్‌పై రిలీజ్ చేసిన స్టిల్లో బాల‌య్య చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు.

రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన టీజ‌ర్‌ను కూడా రేపే విడుద‌ల చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా విచ్చేయ‌నున్నారు. ఇక టీజ‌ర్ రిలీజ్ చేశాక చివ‌ర్లో అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో కూడా చెప్ప‌నున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news