Moviesమహేశ్ ను ఇరకాటంలో పెట్టేసిన గంగవ్వ..పాలిటిక్స్ కి ముడిపెడుతూ..రచ్చ రచ్చ..!!

మహేశ్ ను ఇరకాటంలో పెట్టేసిన గంగవ్వ..పాలిటిక్స్ కి ముడిపెడుతూ..రచ్చ రచ్చ..!!

గంగవ్వ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. “మై విలేజ్ షో” అనే ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్ ఛానల్ ను లాంచ్ చేసి ఆ చానల్లో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు తెలియని విషయాలను నేర్చుకుంటూ 60 ఏళ్ల వయసు దాటిన ఫుల్ యాక్టివ్ గా చలాకిగా సోషల్ మీడియాలో ఉంటూ అందర్నీ ఆకట్టుకుంది. అంతేనా గంగవ్వకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సబ్స్క్రైబర్స్ మరెవ్వరు కు లేరనే చెప్పాలి. యూట్యూబ్ సెలబ్రిటీగా ఏకంగా గంగవ్వ బిగ్ బాస్ షోలోకి వెళ్లి తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి ఏకంగా నాగార్జున చేత తన సొంత ఇంటి కలను ఫుల్ ఫిల్ చేసుకుంది.

గంగవ్వ అంటేనే ఆమె మాటలకు ఫీదా అవుతారు జనాలు. ఆమె వాక్చాతుర్యం ఆమె స్పాంటేనియస్ పంచెస్ ప్రేమగా మాట్లాడే మాటలు ఎవరికీ రావు. అలాగే తన మాటలతో ఏకంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను సైతం మంత్రముగ్ధులను చేసింది గంగవ్వ. కరీంనగర్ కళోత్సవాల్లు దిగ్విజయంగా ముగిశాయి. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడోరోజు అట్టహాసంగా సాగిన కళోత్సవాలలో చివరి రోజు మహాత్మ జ్యోతిబాపూలే మైదానం నుంచి ప్రారంభమైన శోభయాత్ర అంబేద్కర్ స్టేడియం దాకా అట్టహాసంగా జరిగింది . నగర ప్రజలు ఫుల్ జోష్ తో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో గంగవ్వ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ కార్యక్రమంలో గంగవ్వ మాట్లాడుతూ.. కేటీఆర్ ను..” నువ్వు మహేష్ బాబు లెక్క ఉన్నావు” అంటూ ఆకాశానికి ఎత్తేసింది. దీంతో కేటీఆర్ టర్న్ వచ్చాక ఆమెను దగ్గరికి తీసుకొని..” గంగవ్వ నువ్వు నన్ను మహేష్ బాబు అంటున్నావ్ నాకేం ప్రాబ్లం లేదు. కానీ , ఆ మాట వింటే మహేష్ బాబు ఫీలవుతాడేమో” అంటూ సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించాడు . అంతేకాదు కచ్చితంగా ఆయన మై విలేజ్ షో కి వస్తానని ఎన్నో కబుర్లు చెప్తానని నీతో ముచ్చటిస్తానని మాట ఇచ్చాడు. దీంతో గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను కేటీఆర్ లాంటి పొలిటిషియన్ తో పోల్చి గంగవ్వ పరోక్షంగా మహేష్ బాబు రాజకీయాలకు ముడిపెట్టింది అంటూ ప్రిన్స్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి రాజకీయాలలో మహేష్ బాబు పేరు మారుమ్రోగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news