Moviesఆ హీరోయిన్‌తో రొమాన్స్ అంటే ఎన్టీఆర్‌కు అంత స్పెష‌లా...!

ఆ హీరోయిన్‌తో రొమాన్స్ అంటే ఎన్టీఆర్‌కు అంత స్పెష‌లా…!

అన్న‌గారు సినీ రంగంపై వేసిన ముద్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్ సినిమా అంటే చాలు.. అది ఏదైనా కూడా ప్ర‌జ‌లు క్యూ క‌డ‌తారు. దీంతో నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్ష‌మే అనే పేరుఉండేది. ఇక‌, సావిత్రి-ఎన్టీఆర్, సావిత్రి-అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.. జోడీలకు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీరు న‌టించిన సాంఘిక సినిమాల‌కు.. పౌరాణిక‌, జాన‌ప‌ద సినిమాల‌కు.. ఎన‌లేని ఆద‌ర‌ణ ల‌భించింది. మ‌రీ ముఖ్యంగా సావిత్రితో ఎన్టీఆర్ సినిమాలు ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి.

అన్న‌గారు-సావిత్రి.. కేవ‌లం హీరో హీరోయిన్లుగా మాత్ర‌మే కాదు.. అన్నా చెల్లెళ్లుగా కూడా న‌టించారు. ర‌క్త‌సంబంధం సినిమాలో ఎన్టీఆర్‌కు సావిత్రి సోద‌రిగా న‌టించి ర‌క్తిక‌ట్టించారు. ఆ సినిమా కూడా.. సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టింది. ఇలా.. సావిత్రి-ఎన్టీఆర్ జోడీకి తెలుగు, త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు.. ప్రేక్ష‌కులు.. కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక‌, సావిత్రిత‌ర్వాత‌.. ఆ రేంజ్‌లో అన్న‌గారి స‌రస‌న న‌టించి మోత మోగించిన హీరోయిన్లు ఉన్నారా? అంటే.. ఉన్నార‌నే అంటారు ప్రేక్ష‌కులు.నిజానికి .. అన్న‌గారితో న‌టించిన వారిలో అంజ‌లి కూడా ఉన్నారు.

అదేవిధంగా జ‌య‌ల‌లిత కూడా ఉన్నారు. ఒక‌ప్పుడు.. జ‌య‌ల‌లిత‌తో అన్న‌గారి జోడీకిఎంతో క్రేజ్ ఉంది. వారిద్ద‌రు న‌టించిన సినిమాలు కూడా సూప‌ర్ హిట్ కొట్టాయి. పౌరాణికం, సాంఘికం, సామాజికం ఇలా.. అన్ని కోణాల్లోనూ.. జ‌య‌ల‌లిత దుమ్ము రేపారు. దీంతో ఈ ఇద్ద‌రు న‌టించిన సినిమాలు కూడా.. హిట్ట‌య్యాయి. అయితే.. సావిత్రితో న‌టించిన‌ప్పుడు వ‌చ్చిన క్రేజ్ మాత్రం రాలేదు. సినిమాలైతే.. హిట్ట‌య్యాయి.. బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు కూడా బాగానే ఉన్నాయి.

కానీ ఎన్టీఆర్ ప‌క్క‌న‌ సావిత్రి రేంజ్‌ను మ‌రే హీరోయిన్‌ అందుకోలేదు. అయితే.. అన్న‌గారు త‌ర్వాత జ‌య‌సుధ‌తోనూ జ‌య‌ప్ర‌ద‌తోనూ న‌టించారు. వారు కూడా.. సావిత్రి రేంజ్‌లో పుంజుకోలేక పోయారు. దీంతో ఇక‌, సావిత్రి-ఎన్టీఆర్ జోడీని చూసే ప‌రిస్థితిలేద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఆ స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చింది.. శ్రీదేవి. అప్ప‌టికే బాల‌న‌టిగా.. అనేక సినిమాల్లో న‌టించిన‌.. శ్రీదేవి.. యుక్త‌వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత గ్యాప్ తీసుకుని త‌ర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ క్ర‌మంలో వేట‌గాడు సినిమాలో ఎన్టీఆర్‌కు ప‌ర్‌ఫెక్ట్ జోడీ అన్న టాక్ అప్ప‌ట్లో అదిరిపోయింది. త‌ర్వాత‌.. ప‌లు సినిమాల్లో ఎన్టీఆర్‌-శ్రీదేవి జోడీ క‌లిసి న‌టించింది. ఎన్టీఆర్ – శ్రీదేవి జోడీ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు అప్ప‌ట్లో పిచ్చ క్రేజ్ ఉండేది. జ‌నాలు కూడా ఎగ‌బ‌డి మ‌రీ వీరి సినిమాలు చూసేవారు. ఇక ఎన్టీఆర్ ప‌క్క‌న శ్రీదేవి సావిత్రిని మ‌రిపించింద‌నే టాక్ రావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news