Moviesఅబ్బాబ్బా..మెంటెల్ ఎక్కించే అప్డేట్.మహేష్ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు..!!

అబ్బాబ్బా..మెంటెల్ ఎక్కించే అప్డేట్.మహేష్ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు..!!

వారెవ్వా ..ఇది కదా అప్డేట్ అంటే.. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకి నిజమైన పండుగ. ఎస్ ఘట్టమనేని ఫ్యాన్స్ కు పూనకాల తప్పించే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ న్యూస్ విన్న నిజమైన మహేష్ బాబు ఫ్యాన్ ఎవరైనా సరే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . అంత పవర్ ప్యాక్డ్ న్యూస్ ఇది . మనకు తెలిసిందే మహేష్ బాబు లాస్ట్ గా నటించిన చిత్రం సర్కారు వారి పాట . ఈ సినిమా కూడా మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది .

కాగా ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాలో నటిస్తున్నాడు . రీసెంట్ గా షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా మొదలైన కొద్ది రోజులకే బ్రేక్ పడింది .దానికి కారణం మహేష్ బాబు తల్లి గారు ఇందిరా దేవి గారు మరణించడం . దీంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పూర్తి అవ్వగానే మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమాలో నటించబోతున్నాడని తెలిసిందే.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మరో ఇద్దరు హీరోలను తీసుకోబోతున్నాడట రాజమౌళి. అందులో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తమిల్ తో పాటు తెలుగులో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్న కార్తీ.. సూర్య తమ్ముడు. ఇప్పటికే రాజమౌళి కార్తీ ను మీట్ అయ్యి తన పాత్ర గురించి వివరించాడని కార్తీ చాలా ఇంప్రెస్ అయ్యాడని సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు రన్వీర్ సింగ్ కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నడట రణవీర్. ఒకవేళ అదే నిజమైతే మహేష్ బాబు సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డును కొల్లగొడుతుందని చెప్పడంలో సందేహమే లేదు . టాలీవుడ్ స్టార్ హీరో కోలీవుడ్ మాస్ హీరో బాలీవుడ్ బాడీ హీరో ముగ్గురు హీరోలు కలిస్తే ఇక రచ్చ రచ్చే కదా . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ యాక్షన్ ఫిలిం గా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారట ఎస్ ఎస్ రాజమౌళి. అందుకే ఈ క్రమంలోనే భారీ క్యాస్టింగ్ ను తీసుకోవాలనుకుంటున్నారట జక్కన్న.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news