Moviesహీరోలతో రొమాన్స్ చేయడం ఇష్టం... రాశీఖ‌న్నా మైండ్ బ్లోయింగ్ బోల్డ్ కామెంట్స్‌...!

హీరోలతో రొమాన్స్ చేయడం ఇష్టం… రాశీఖ‌న్నా మైండ్ బ్లోయింగ్ బోల్డ్ కామెంట్స్‌…!

మద్రాస్ కేఫ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశీ ఖ‌న్నా. అదే ఏడాది రాశీఖ‌న్నా తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులోనే రాశి వ‌రుస‌ ఆఫర్లను అందుకుంది. ర‌వితేజ హీరోగా న‌టించిన బెంగాల్ టైగర్ సినిమాతో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఆ త‌ర‌వాత‌ సుప్రీమ్‌, హైపర్, జై లవకుశ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ సినిమాల్లో అందచందాలతో కుర్రాళ్ల‌ను తన‌వైపు తిప్పుకుంది.

కేవ‌లం సినిమాల‌లోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు అందాల‌ను ఆరబోస్తోంది. ఇక‌ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ రాశీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. కార‌ణం ఏదైనా ఆమె తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో 8 ఏళ్లుగా ఉంటున్నా స్టార్ హీరోయిన్ కాలేదు. స్టార్లలో ఒక్క ఎన్టీఆర్ మిన‌హా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ఇదిలా ఉంటే రాశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సారణంగా చాలామంది హీరోయిన్లు రొమాంటిక్ సీన్లు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని చెబుతుంటారు.

ముఖ్యంగా ఒకప్పటి హీరోయిన్లు రొమాంటిక్ సీన్లు అంటేనే భయపడి పోయేవారు. కానీ ఇప్పటి హీరోయిన్ లు మాత్రం హద్దులు లేకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా అలాంటి పాత్ర‌ల్లో నటించడానికే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక‌ రొమాంటిక్ సన్నివేశాలపైనే రాశీ కూడా ఆసక్తికర కామెంట్లు చేసింది. ఓ ఇంటర్వ్యూలో రాశీ మాట్లాడుతూ…. తన అభిప్రాయం ప్రకారం కామెడీ పండించడం చాలా కష్టమని చెప్పింది. కామెడీ పండించాలంటే ఫ్రేమ్ లో ఇతర నటీనటుల నటనపై కూడా మ‌న‌ టైమింగ్ ఆధారపడి ఉంటుందని కామెంట్ చేసింది.

కానీ రొమాన్స్ అలా కాదని… కామెడీతో పోలిస్తే రొమాన్స్ సీన్లు చాలా సులభం అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు రొమాంటిక్ సన్నివేశాలు చేసి బోర్ కొట్టిందని.. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. అంతేకాకుండా తనకు యాక్షన్ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తే బాగుంటుందని చెప్పింది. హాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాల గురించి చెబుతూ అలాంటి సినిమాల్లో నటించాలని ఉన్నట్టు తెలిపింది. మ‌రి రాశీఖ‌న్నా కోరిక నెర‌వేరుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news