Moviesబిగ్ షాకింగ్: రాజకీయాలోకి ప్రియమణి.. అన్ని కలిసి వస్తే సీఎం కూడా..!?

బిగ్ షాకింగ్: రాజకీయాలోకి ప్రియమణి.. అన్ని కలిసి వస్తే సీఎం కూడా..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి రోల్స్ అయిన చేయడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిన అందాల ముద్దుగుమ్మలు.. ఆఫర్లు రాక అందాలు ఆరబోయడానికి నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తనదైనా స్టైల్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ప్రియమణి ..రీసెంట్గా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర బృందం.

మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్య వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ కృతి శెట్టి నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బుల్లితెర బ్యూటీ వంటలక్క నటిస్తున్నారు. కాగా ఈ క్రమంలోని ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది అంటూ అఫీషియల్ ప్రకటన చేసింది చిత్ర బృందం.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియమణి పొలిటీషియన్ గా కనబడుతుందట . అంతేకాదు సెకండ్ పార్ట్ లో ప్రియమణి సీఎంగా మనకి కనిపించి మెప్పించబోతుంది అన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఒక లేడీ.. సీఎం అయితే రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో మగాళ్లు చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాలకి చూపే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది . ఏదేమైనా సరే ప్రియమణి ఇలా రాజకీయాల వైపు అడుగులు వేయడం షాకింగ్ గా ఉంది అంటున్నారు అభిమానులు . మరి చూడాలి సీఎంగా ఈ ప్రియమణి ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news