Moviesటాలీవుడ్‌లో హీరోయిన్ ల‌య ద‌య‌తో టాప్ పొజిష‌న్లో ఉన్న వ్య‌క్తి ఎవ‌రో...

టాలీవుడ్‌లో హీరోయిన్ ల‌య ద‌య‌తో టాప్ పొజిష‌న్లో ఉన్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా…!

హీరోయిన్ లయ గురించి అందరికీ తెలిసిందే. స్వయంవరం సినిమాతో హీరోగా పరిచయమై ఫ్యామిలీ హీరోయిన్‌గా అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అచ్చ తెలుగమ్మాయి అయిన లయ ఇండస్ట్రీలో బాగానే నెట్టుకొచ్చింది. కాస్త గ్లామర్ పాత్రలు చేసినా కూడా వాటి శాతం చాలా తక్కువే. ఎక్కువగా చీరకట్టులో కనిపించి ఆకట్టుకున్నవే ఉన్నాయి. ప్రేమించు, మనోహరం, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలు లయకి హీరోయిన్‌గా మంచి పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

ఒకవైపు గ్లామర్ హీరోయిన్ ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇచ్చినా కూడా కొన్ని సినిమాలు లయను వెతుక్కుంటూ వచ్చాయంటే తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కలేదు. లేకపోతే ఖచ్చితంగా సౌందర్య రేంజ్‌లో లయ టాలీవుడ్‌లో అగ్ర స్థానానికి చేరుకునేది. ఇలా చేరుకోకపోవడానికి కారణం మరీ మితి మీరిన అందాల ఆరబోత చేయకపోవడంతో పాటు కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ రాకపోవడమే.

అయినా కూడా తను నటించిన సినిమాలతోనే మంచి పాపులారిటీని దక్కించుకోవడంతో పాటు బాగానే సంపాదించింది. ఇక అప్పట్లో లయకి సురేష్ కొండేటి పీఆర్‌వోగా వ్యవహరించేవారట. ఓ సందర్భంలో సురేష్ కొండేటి..ప్రముఖ వ్యక్తి వల్ల అవమానించబడి..ఎలాగైనా ఇండస్ట్రీలో అగ్ర స్థానానికి చేరుకోవాలని పట్టుదల కసితో లయ సహాయం కోరారట. నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు గాను సురేష్ ..హీరోయిన్ లయ వద్ద అప్పుగా కొంత డబ్బు సహాయం కోరినట్టు టాక్ వినిపించింది.

లయ డేట్స్ అన్నీ ఆయనే చూస్తుండటంతో ఎంతో నమ్మకంగా అడిగిన వెంటనే సురేష్ కొండేటికి డబ్బు సహాయం చేసినట్టు చెప్పుకున్నారు. అలా సంతోషం సినిమా కొని మంచి లాభాలను అందుకున్న సురెష్ ..అదే పేరుతో సినిమా మ్యాగ్జైన్ ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి, నాగార్జునలతో చెప్పగా వారు సపోర్ట్ చేస్తామని ధైర్యాన్నిచ్చారట.

అలా సంతోషం మ్యాగ్జైన్ ప్రారంభించిన సురేష్ ప్రతీ ఏటా సంతోషం అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతగానూ మంచి స్థానంలో ఉన్నారు. ఇలా ఆయన టాలీవుడ్‌లో ఓ అగ్ర స్థానానికి వచ్చారంటే దీనికి కారణం హీరోయిన్ లయ చేసిన సహాయమే అంటుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news