Moviesఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ టైటిల్ వెన‌క ఎస్వీఆర్ స‌ల‌హా ఉంద‌ని తెలుసా...!

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ టైటిల్ వెన‌క ఎస్వీఆర్ స‌ల‌హా ఉంద‌ని తెలుసా…!

ఎస్వీ రంగారావు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే కాకుండా.. విల‌న్ రోల్స్ ఎక్కువ‌గా న‌టించారు. చిత్రం ఏంటంటే.. ఆయ‌న తెలుగు సినిమాల్లో రారాజుగా పేర్కొంటారు. ఎందుకంటే. ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాకు చెందిన న‌టుడు కాబ‌ట్టి. అయితే.. నిజానికి ఆయ‌న ఎక్కువ‌గా న‌టించిన సినిమాలు త‌మిళంలోనే న‌ట‌. దీంతో ఆయ‌న‌కు తెలుగు రాజ‌కీయాల‌న్నా.. త‌మిళంలో ఉన్న రాజ‌కీయాలు.. ఆ రాష్ట్రంలో నేత‌లు అంటే.. అమిత‌మైన గౌర‌వం ఉండేద‌ట‌.

పైగా.. ఎంజీఆర్ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా.. పార్టీ పెట్టినా.. ఆయ‌న దానిలో చేర‌కుండా.. కాంగ్రెస్ వాదుల‌ను స‌మ‌ర్ధించిన ప‌రిస్థితి ఉంద‌ట‌. అయితే.. ఎప్పుడు.. రాజ‌కీయ చ‌ర్చ‌లు వ‌చ్చినా. కాంగ్రెస్‌ను గుడ్డిగా ఆయ‌న స‌మ‌ర్ధించేవార‌ట‌. నిజానికిఇలాంటి చ‌ర్చ‌లు.. షూటింగుల స‌మ‌యం క‌న్నా.. త‌ర్వాత ధూమ‌పానం చేసే స‌మ‌యంలోనే.. వ‌చ్చేవి. ఆ స‌మ‌యంలో అన్న‌గారితోనూ రంగారావు రాజ‌కీయాలు చ‌ర్చించేవార‌ట‌.

నిజానికి అప్ప‌టికి.. రామారావు దృష్టి అంతా కెరీర్‌పైనే ఉండేద‌ట‌. రంగారావు లాగా .. న‌టించాల‌ని త‌ప‌న ప‌డేవార‌ట‌. దీనిని చూసిన రంగారావు.. కాంగ్రెస్‌ను చూసి కాపీకొట్టిన‌ట్టు ఉంటుంది.. అంటూ.. రాజ‌కీయ ప‌రిభాషలో చ‌మ‌త్కారంగా మాట్లాడేవార‌ట‌. అంటే.. కాంగ్రెస్ పెద్ద‌ద‌ని.. ఇత‌ర పార్టీలు దానిని చూసుకుని నేర్చుకుంటున్నాయ‌ని ఆయ‌న భావ‌న‌. అలా వ‌ద్దు.. నీ అంత‌ట నువ్వు ఎదిగే ప్ర‌య‌త్నం చేయ‌మ‌ని.. రామారావు కు స‌ల‌హా ఇచ్చేవార‌ట‌.

దీంతో రామారావు.. త‌ర్వాత‌.. కాలంలో కాంగ్రెస్‌ను కాపీ కొట్ట‌కుండా.. సొంత పార్టీ పెట్టుకున్నారు. అదే స‌మ‌యంలో ఏర్ప‌డిన అనేక పార్టీల్లో.. `కాంగ్రెస్‌` అనే ప‌దం ఉండేది. కానీ.. టీడీపీలో అది ఉండ‌క‌పోవ‌డం వెనుక రంగారావు సూచ‌న‌లేన‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news