Moviesఆ హీరోయిన్ చెప్పులు మోసిన స్టార్ హీరో.. "ఒక్క మగాడు"...

ఆ హీరోయిన్ చెప్పులు మోసిన స్టార్ హీరో.. “ఒక్క మగాడు” అంటూ జేజేలు..!!

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉంటారు . కానీ ఎవ్వరు కూడా హీరోయిన్ కి ఏ విషయంలో హెల్ప్ చేయరు. సినిమా చేసే టైం వరకు ఒకలా ఉంటారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హీరోయిన్ పేరుని కూడా మర్చిపోతారు . అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు . అవసరానికి వాడుకుని వదిలేసి సినిమా స్టార్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అయితే వాళ్లందరిలోకి డిఫరెంట్ మైండ్ సెట్ కలవాడు హీరో విక్రమ్.

ఈ కోలీవుడ్ స్టార్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న విక్రమ్ కోలీవుడ్లో స్టార్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే విక్రమ్ తాను సినిమాలు చేసే టైంలో సినిమాలో హీరోయిన్స్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడని సరదాగా మాట్లాడుతూ ఉంటాడని అందరూ చెప్పుకొస్తారు. అంతేకాదు ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటూనే ఎదుటి వాళ్ళ ప్రాబ్లంను అర్థం చేసుకునే మంచి మనసున్న వ్యక్తి విక్రమ్ అంటూ చాలామంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు .

అయితే వాళ్లందరిలోకి హీరోయిన్ దీక్షా సేధ చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. వీళ్లిద్దరూ కలిసి వీడింతే అనే సినిమాలో కలిసి నటించారు . ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. అయినప్పటికీ నటన పరంగా విక్రమ్ అందాల పరంగా దీక్ష ఇద్దరూ సక్సెస్ అయ్యారు . అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో హీరో విక్రమ్ తన చెప్పులు మోసుకొచ్చాడని షాకింగ్ కామెంట్స్ చేసింది దీక్షా. ఓ పాటలో భాగంగా ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిన వీళ్లు అక్కడ షూటింగ్ చేసుకున్న తర్వాత ఆమె ఆ చలికి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వచ్చేసానని.. అయితే తన చెప్పులను అక్కడే మర్చిపోయిందని ..ఆ చెప్పులను హీరో విక్రమ్ చేతులతో పట్టుకొని తీసుకోరావడం ..నాకు షాకింగ్ అనిపించిందని ..ఇండస్ట్రీలో ఇలాంటి హీరోలు కూడా ఉంటారా అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు “నేను చాలామంది హీరోలతో వర్క్ చేశాను ఏ హీరో కూడా..హీరోయిన్ పట్ల ఇంత కేర్ గా ఉండడు. ఆ విషయంలో విక్రమ్ చాలా గ్రేట్ “అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు అప్పట్లో కోలీవుడ్ ఒక్క మగాడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news