Moviesబిగ్ షాకింగ్: మహేష్‌ బాబు క్రేజ్‌ కే ఘోర అవమానం..ఫ్యాన్స్ తట్టుకోగలరా..!?

బిగ్ షాకింగ్: మహేష్‌ బాబు క్రేజ్‌ కే ఘోర అవమానం..ఫ్యాన్స్ తట్టుకోగలరా..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సినిమా “సర్కారు వారి పాట”. పరశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 12 మే 2022న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . ఈ సినిమాల్లో మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు మహేష్ బాబు స్పాంటేనియస్ పంచెస్ కీర్తి సురేష్ తో చేసిన రొమాన్స్ ..వేసిన మాస్టెప్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

మరీ ముఖ్యంగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది తమన్ సంగీతం . కళావతి సాంగ్ ఇప్పటికీ జనాల చెవుల్లో మారుమ్రోగిపోతుంది అంటే ఈ సినిమా ఎలాంటి హిట్ సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది సర్కారు వారి పాట . అయితే వెండితెరపై సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది


సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ సక్సెస్ అయిన మహేష్ బాబు.. బుల్లితెరపై కూడా ఓ రేంజ్ లో రికార్డులు కొల్లగొడతారని అంతా అనుకున్నారు . అయితే బుల్లితెరపై మాత్రం మహేష్ బాబు తన స్టామినాను చాటుకోలేకపోయాడు . బుల్లితెరపై జెమినీ టీవీలో టెలికాస్ట్ అయినా సర్కారు వారి పాట సినిమాకు పేలవమైన టిఆర్పి రేటింగ్ దక్కింది. దానికి ముఖ్య కారణం ఆ రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రావడం . దీంతో వెండితెరపై సక్సెస్ అయిన సర్కారు వారి పాట బుల్లితెరపై మాత్రం బోల్తా కొట్టింది. HD + SD 11.1 కాగా టోటల్ రేటింగ్ 9.45 వచ్చింది .ఇది మహేష్ బాబు కెరియర్ లోనే పరమ చెత్త రికార్డు అంటున్నారు జనాలు. దీంతో ఇంతకన్నా మహేష్ బాబుకు ఘోర అవమానం మరొకటి లేదు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. కాగా ఈ ఏడాదిలో 20 పాయింట్లతో అన్నిటికన్నా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది ఆర్ఆర్ఆర్ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news