Moviesఆ చిన్న తప్పుతో ఆస్పత్రి పాలైన ఖుష్బూ..అసలు ఏమైందంటే ..?

ఆ చిన్న తప్పుతో ఆస్పత్రి పాలైన ఖుష్బూ..అసలు ఏమైందంటే ..?

కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటి కుష్బూ సుందర్ ఆసుపత్రి పాలైంది. ప్రజెంట్ ఇదే విషయం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతుంది. ఆమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో కుష్బూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు, అసలు కుష్బూకి ఏమైంది..? బాగున్న ఆవిడ ఎందుకిలా హాస్పిటల్ బెడ్ పై పడి ఉంది..? కుష్బూకి మళ్లీ కరోనా వచ్చిందా ..?ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది..? ఇలా అభిమానులు వరుసగా కామెంట్స్ చేస్తూ కుష్బూ పేరుని టాప్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.

సినీ నటి కుష్బూ సుందర్ ఆసుపత్రి పాలైన మాట వాస్తవమే.. ఈ విషయన్ని అధికారికంగా ప్రకటించింది ఆమె. తన వెన్నముక సమస్యతో ఆమె హాస్పిటల్ లో చేరానంటూ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు మరింత కంగారు పడుతున్నారు . అయితే ప్రజెంట్ ఆమె ఆరోగ్యం బాగున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కుష్బూ చాలా బరువు తగ్గింది. దీనికోసం ఆమె కఠిన వ్యాయామాలు చేసిందట. ఫుడ్ డైట్ లు ఫాలో అయిందట . దీంతో ఒక్కసారిగా బాడీలో మార్పులు చోటు చేసుకున్నాయి .

మరీ ముఖ్యంగా హెవీ వర్కౌట్ చేయడం కారణంగా ఆమె వెన్నముక తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది . ఈ కారణంగానే ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వెన్నముక సమస్యకు చికిత్స తీసుకుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కుష్బూ కూడా ట్విట్ చేస్తూ ..”వెన్నెముక సమస్యతో హాస్పిటల్లో చేరాను. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ నా పనులు మొదలు పెడతాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కలవర పడుతున్నారు..” మీరు రెస్ట్ తీసుకోండి మేడం.. త్వరగా కోలుకోండి ..మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి “అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news