Moviesసీనియర్ నటి పూర్ణిమను చెంప పగలొట్టిందెవరో తెలుసా..?

సీనియర్ నటి పూర్ణిమను చెంప పగలొట్టిందెవరో తెలుసా..?

పూర్ణిమ..ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలు ముద్ద మందారం, శ్రీవారికి ప్రేమలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలు. పూర్ణిమ అమ్మా నాన్నలది తెలుగు సాంప్రదాయ కుటుంబం. విశాఖపట్నం, చెన్నైలో నివసించేవారు. పూర్ణిమ చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే హరిశ్చంద్రుడు సినిమాలో పాట ఆడే అవకాశం వస్తే వెళ్ళారు. అయితే, చూసేందుకు చక్కగా ఉండటంతో ఈ సినిమాలో మహానటి సావిత్రికి కూతురుగా చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

ఆ అవకాశమే పూర్ణిమ పెద్ద నటిగా మారడానికి కారణం అయింది. వాస్తవంగా పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ అప్పటి స్టార్ డైరెక్టర్ జంధ్యాల సహా మరికొంతమంది ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో మొదటిసారి హీరోయిన్‌గా ముద్దమందారం సినిమాలో నటింపచేసేందుకు ఒప్పించారు. పూర్ణిమకి సహజనటి అనే పేరు కూడా ఉండేది. ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా నేచురల్‌గా ఉండేది.

డైలాగ్ డెలివరీ కూడా అప్పటితరం వారికి చాలా కొత్తగా అనిపించింది. ప్రత్యేకంగా దర్శకరచయితలు తనకోసం కథ రాసేవారంటే నటన పరంగా ఎంతగా ఆకట్టుకున్నారో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముద్ద మందారం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, మా పల్లెలో గోపాలుడు లాంటి అద్భుతమైన సినిమాలు చేసే అవకాశాలు అందుకున్నారు. ఇక తన కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగాయి.

గొల్లపూడి మారుతీరావుకి కూతురిగా నటించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా పెద్ద డైలాగ్ చెప్పాల్సి వచ్చిందట. ఎప్పుడూ తడబడకుండా డైలాగ్స్ చెప్పే పూర్ణిమకి ఎందుకో మొదటిసారి ఒక పేజీ మొత్తం ఉన్న డైలాగ్స్ చూసి కాస్త కంగారు వచ్చిందట. మొత్తానికి పట్టుపట్టి దర్శకుడు డైలాగ్ చెప్పించారు. అంత పెద్ద డైలాగ్ సింగిల్ టేక్‌లో పూర్తి చేసారట పూర్ణిమ. అయితే చివరిలో నాన్నా అనే పదం మర్చిపోవడంతో ఎదురుగా ఉన్న గొల్లపూడి తలమీద గట్టిగా కొట్టారట.

అది నాన్నా అనే పదం మర్చిపోయినందుకు కాదు..అంత పెద్ద డైలాగ్ చక్కటి ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పినందుకు ఆనందంతో. కానీ, దెబ్బ గట్టిగా తగలడంతో పూర్ణిమ కిందపడిపోయారట. అదే సమయంలో పూర్ణిమ తండ్రి అక్కడే ఉండటంతో గొల్లపూడి మీద కేకలు వేసి అక్కడ్నుంచి పూర్ణిమను తీసుకెళ్ళిపోయారట. ఈ సంఘటన ఆమె ఎప్పటికీ మర్చిపోలేమని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news