Moviesహిట్ట‌వుతుంద‌న్న సినిమా ఫ్లాప్‌... ఎన్టీఆర్‌పై పెద్ద అభాండం వేసిన నిర్మాత‌...!

హిట్ట‌వుతుంద‌న్న సినిమా ఫ్లాప్‌… ఎన్టీఆర్‌పై పెద్ద అభాండం వేసిన నిర్మాత‌…!

రామారావు న‌టించాడంటే.. సినిమా హిట్‌! ఇదీ.. ఒక‌ప్ప‌టి సినిమా నిర్మాత‌లు అన్న‌గారిపై పెట్టుకున్న ఆశ‌లు. అయితే.. అన్ని రోజులు ఒకే లా ఉండాలని లేవు క‌దా.. అన్న‌గారు ఎంతో ముచ్చ‌ట‌ప‌డి తీసుకున్న సినిమాలు కూడా.. ప్లాప్ అయిన‌వి కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో తోడు దొంగ‌లు సినిమా ఒక‌టి. దీనిలో అన్న‌గారు.. గుమ్మ‌డి.. తోడు దొంగ‌లుగా న‌టించారు. ఇది అప్ప‌ట్లో భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమా. కొత్త‌గా వ‌చ్చిన నిర్మాత‌.. చేతికి ఎముక లేకుండా ఖ‌ర్చు చేశారు.

దీనికి ఆయ‌న చెప్పిన స‌మాధానం.. రామారావు న‌టించాడంటే.. సినిమా హిట్టే.. అని! దీంతో ఉన్న‌దీ.. అప్పు తెచ్చిందీ కూడా.. మొత్తంగా.. సినిమాపై క‌న‌క వ‌ర్షం కురిపించారు. ఎక్క‌డి నుంచో ప్ర‌త్యేక సెట్టింగులు ఏర్పాటు చేసేవారిని తీసుకువ‌చ్చి.. వారికి అప్ప‌ట్లోనే అన్ని వ‌స‌తులు క‌ల్పించి.. తోడు దొంగ‌లు చిత్రాన్ని తెర‌మీద‌కి ఎక్కించారు. అప్ప‌టికే ఎన్టీఆర్ న‌టించిన సినిమాలు చాలా వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో తోడుదొంగ‌లు సినిమాకు మంచి బిజినెస్ కూడా జ‌రిగింది.

అయితే.. ఈ సినిమా.. ఆశించినంత‌గా ఆడ‌లేదు. దీంతో అన్న‌గారు.. తీవ్ర‌నిరాశ‌లో కూరుకుపోయారు. అయితే.. ఈ నిర్మాత చాలా ఘ‌టికుడ‌ట‌. (ఈ విష‌యాన్ని గుమ్మ‌డి రాసుకున్నారు) ఆయ‌న వెళ్లి.. ప్ర‌తి ఒక్క‌రితోనూ.. అన్న‌గారు కావాల‌నే ఈ సినిమాలో స‌రిగా న‌టించ‌లేదు.. అందుకే సినిమా ఫెయిల్ అయిపోయింద‌ని ప్ర‌చారం చేశాడ‌ట‌. అయితే.. మొద‌ట్లో ఈయ‌న చెప్పింది న‌మ్మ‌క‌పోయినా.. సినిమాను కావాల‌ని కొంద‌రు చూశారు.

ఆ త‌ర్వాత‌.. అన్న‌గారికి మూడు మాసాల పాటు.. ఎలాంటి ఆఫ‌ర్లు రాలేదు. దీంతో ఆయ‌న గుమ్మ‌డి రూంలో ఉండి.. త‌ర్వాత‌.. వ‌చ్చిన మిస్స‌మ్మ అవ‌కాశం అందిపుచ్చుకుని.. మ‌ళ్లీ ఫాలోయింగ్ పెంచుకున్నార‌ని గుమ్మ‌డి రాశారు. ఈ విష‌యంపై అన్న‌గారు త‌ర‌చు త‌న‌తో చ‌ర్చించేవార‌ని గుమ్మ‌డి రాసుకోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news