Moviesఆ ఒక్క మాటతో జనాలకు పూనకాళ్లు తెప్పించిన మెగాస్టార్..మైండ్ బ్లోయింగ్ స్పీచ్..!!

ఆ ఒక్క మాటతో జనాలకు పూనకాళ్లు తెప్పించిన మెగాస్టార్..మైండ్ బ్లోయింగ్ స్పీచ్..!!

టాలీవుడ్ మెగాస్టార్ హీరో చిరంజీవి తాజాగా నటించిన చిత్రం “గాడ్ ఫాదర్”. మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామాగా లూసిఫర్ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాని ఎప్పటినుంచో తెలుగులో రీమిక్ చేయాలనుకుంటున్న చిరంజీవి “గాడ్ ఫాదర్” అనే పేరు తో తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాను మోహన్ రాజా తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశారు .ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నయనతార ..నయనతారకు భర్త పాత్రలో సత్యదేవ్ నటించారు.

భారీతారాగాణంతో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో ఈవెంట్ కి వచ్చిన మెగా ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అయితే మెగా ఫాన్స్ ని హర్ట్ చేయకుండా చిరంజీవి మాత్రం అంత పెద్ద వర్షంలోనూ గొడుగును పక్కకు నెట్టి గూస్ బంప్స్ స్పీచ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈవెంట్లో చిరు మాట్లాడుతూ..” నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చిన ఇలా వరుణ దేవుడు నన్ను పులకరింప చేస్తూనే ఉంటాడు. నా రాజకీయ పార్టీ ప్రారంభం రోజుల్లోనూ ఇలాగే జరిగింది . అంతెందుకు ఇంద్ర సినిమా సమయంలోను ఆ వరుణుడు నన్ను ఇలాగే ఆశీస్సులతో దీవించాడు . గాడ్ ఫాదర్ సమయంలోనూ ఇలాగే ఆ వానదేవుడు నాపై దీవెనలు కురిపించాడు .ఈ సందర్భంగా వానదేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను “అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. అంతేకాదు చిరంజీవి స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందు రీసెంట్ గా మరణించిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవికి ఘన నివాళి అర్పించారు. ఆమెను కోల్పోవడం పట్ల మహేష్ కుటుంబానికి కృష్ణకు సానుభూతి వ్యక్తం చేశారు . అంతే కాదు సినిమాలో నటీనటుల గురించి టెక్నీషియన్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడారూ. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news