Moviesపుండు మీద కారం చల్లిన సమంత తండ్రి ..ఒక్క పోస్ట్ తో...

పుండు మీద కారం చల్లిన సమంత తండ్రి ..ఒక్క పోస్ట్ తో అక్కినేని వాళ్ల పరువు పాయే..!?

పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత ఫాదర్ పెట్టిన పోస్ట్ అక్కినేని అభిమానులకు మండిస్తుంది. అంత ఘాటుగానే పెట్టాడు ఆయన. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోని అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా గ్రాండ్ గా జరిపారు కుటుంబ సభ్యులు. అబ్బో ఆ ఫొటోస్ ఇప్పుడు చూసిన కొత్త ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది . అంత కొత్తగా సరికొత్త డెకర్ తో బాగా చేసుకున్నారు . అయితే పెళ్లి డెకరేషన్ పై చేసిన కాన్సన్ట్రేషన్ పెళ్లి తర్వాత తమ లైఫ్ పై చేయలేకపోయారు ఈ జంట . అందుకే పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు.


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా 11 నెలల క్రితం మేము విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించి ఈ జంట అక్కినేని అభిమానులకు గుండె బద్దలు కొట్టింది .ఇప్పటికీ ఈ జంట ఎందుకు విడిపోయింది అనేదానికి రీజన్స్ లేదు. అది ఓ మిలియన్ డాలర్ ప్రశ్నలాగే మిగిలిపోయింది . కొందరేమో సమంత బిహేవియర్ నచ్చక నాగచైతన్య విడాకులు ఇచ్చారు అంటే ..మరి కొందరేమో నాగచైతన్యకు వేరే హీరోయిన్ తో అఫైర్ ఉందని ఆ విషయంలో నాగార్జున సపోర్ట్ చేశాడని.. ఆ కారణంగానే సమంత హాట్ విడాకులు ఇచ్చేసిందని ,,కొన్ని రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఇప్పటికీ వీళ్లిద్దరికి సంబంధించి ఏదో ఒక విషయం ప్రతిరోజు మనం మీడియాలో వింటూనే ఉంటాం.


కాగా తాజాగా సమంత తండ్రి చేసిన హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు రీసెంట్ గా వెడ్డింగ్ అటెండ్ అయ్యారు . ఆ వెడ్డింగ్ తాలూకా పిక్స్ షేర్ చేస్తూ దానితో పాటు సమంత వెడ్డింగ్ పిక్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దీని క్రింద ఆయన రాసుకొస్తూ..” ఇది చాలా కాలం నాటి కధ. ఆ కథ కథలాగే మిగిలిపోయింది ఇప్పుడు ఆ కథ తాలుక జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి . కాబట్టి సమంత,.. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించు.. కొత్త అధ్యాయనం మొదలు పెట్టు “అంటూ తన ఫ్యామిలీలో జరిగిన ఓ మ్యారేజ్ పిక్స్ అలాగే సమంత నాగచైతన్య మ్యారేజ్ పిక్స్ షేర్ చేస్తూ జోసెఫ్ పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అంతేకాదు ఇది పరోక్షకంగా అక్కినేని ఫ్యాన్స్ను అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేసి పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news