Moviesహిట్ కోసం అలాంటి పని..వకీల్ బ్యూటీ నిర్ణయానికి జనాలు ఫిదా..పాప తెలివైందే..!!?

హిట్ కోసం అలాంటి పని..వకీల్ బ్యూటీ నిర్ణయానికి జనాలు ఫిదా..పాప తెలివైందే..!!?

వామ్మో.. ఏంటిది ఈ కుర్ర బ్యూటీ దానికి కూడా ఓకే చెప్పేసిందా..? ఎస్ ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మనకు తెలిసిందే వకీల్ సాబ్ సినిమా ద్వారా అనన్య నాగళ్ళ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో ఈ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అంతేకాదు ఇప్పటికి ఆమెకు సినిమాలో అరాకొరా ఆఫర్స్ వస్తున్నా కానీ అనన్య నాగళ్ల పాపులారిటీ మొత్తం సోషల్ మీడియా ద్వారానే దక్కించుకుంది. ఎందుకంటే ఆమె ఎప్పటికప్పుడు చేసే హాట్ ఫోటోషూట్స్ నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంటాయి.

మనకు తెలిసిందే అనన్య నాగళ్ల ఎప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ట్రెండీ వేర్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది . అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణించడానికి ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది అంటూ సినీ వర్గాలల్లో న్యూస్ వైరల్ గా మారింది. ఎస్ అనన్య నాగళ్ళ ఇకపై సిస్టర్ రోల్ కి కూడా ఓకే చేయనుందట. తాజా సమాచారం ప్రకారం సీనియర్ హీరో సినిమాలలో అనన్య నాగళ్లకు సిస్టర్, డాటర్ రోల్స్ వస్తున్నాయట. ఇప్పటివరకు ఆమె వద్దకు వస్తున్న అన్ని ఆఫర్స్ అలాంటివే కావడంతో అనన్య నాగళ్ళ హీరోయిన్ గా కన్నా కూడా డాటర్స్ ..సిస్టర్స్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందట.

అంతేకాదు దీనికోసం ఏకంగా 70 లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని ముందుకొస్తున్నారట మేకర్స్. నిజానికి అనన్య నాగళ్ళ తెలుగులో కొట్టిన ఒకే ఒక్క హిట్ వకీల్ సాబ్. అది కూడా హీరోయిన్ కాదు ఒక చిన్న క్యారెక్టర్.. అంతే . పెద్దగా చెప్పుకునే తగ్గ క్యారెక్టర్ కూడా కాదు. అయినా కానీ ఈమె ఎక్స్ప్రెషన్స్ జనాలకు నచ్చాయి.. పర్ఫామెన్స్ కూడా బాగుంది. ఈమె డెడికేషన్ గురించి పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సబ్ ఈవెంట్లో చెప్పి ఆశ్చర్యపరిచారు . దీంతో అనన్య నాగళ్లకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉంది అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడు తను అనుకున్న హీరోయిన్ పాత్ర కన్నా కూడా వచ్చిన ఆఫర్స్ లో నచ్చిన రోల్ చేసి జనాలను మెప్పించడానికి సిద్ధపడిందట. మరి చూడాలి ఈ బ్యూటీ ఎలా మెప్పిస్తుందో చెల్లి పాత్రల్లో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news