Moviesఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ..మోహన్ బాబు ను తల...

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ..మోహన్ బాబు ను తల ఎత్తుకునేలా చేస్తున్న మంచు మనోజ్.. ఎంత ధైర్యం..!?

యస్ ఇప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లో ఒకటే వార్త హాట్ టాపిక్ గా మారింది. మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. అది కూడా ఓ బడా రాజకీయనేత కూతురుని. దీంతో అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రిలోను ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . ంఅంతే కాదు వాళ్ళిద్దరూ కలిసి మీడియా కంట కనపడటంతో ఈ వార్తను అఫీషియల్ గా నమ్ముతున్నారు మంచు ఫాన్స్.


సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబుకు ఎలాంటి పేరు ఉందో మనకు తెలిసిందే. ఒకప్పుడు తన స్టైల్ తో తనదైన రీతిలో నటన కనబరిచి ఎలాంటి డైలాగునైనా సరే సింగిల్ టేక్ లో చెప్పి జనాలను మెప్పించే మోహన్ బాబు.. ప్రజెంట్ సినీ ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నారు. కాగా ఆయన వారసత్వం అంత పుచ్చుకొని ఆయన బిడ్డలు.. మంచు లక్ష్మి ,కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ ముగ్గురు సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఇంకా సక్సెస్ అవ్వలేదు.

పర్సనల్ గా వీళ్ళు బాగా సెటిల్ అయినా.. సినీ పరంగా మాత్రం వీళ్లు ఇంకా చాలా ఎదగాలి అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . అయితే మంచు విష్ణు, లక్ష్మి లైఫ్ లో పిల్లలతో బాగా సెటిల్ అయ్యారు. మంచు మనోజ్ మాత్రం తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి కొన్ని కారణాల చేత డివర్స్ ఇచ్చి ఇన్నాళ్లు సింగిల్ గా ఉన్నారు. కాగా రీసెంట్ గా మంచు మనోజ్ ఓ రాజకీయనేత కూతురుతో కనపడడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

హైదరాబాద్ సీతాఫల మడిలో ఓ వినాయక మండపానికి ప్రత్యేక పూజలు చేశారు మంచు మనోజ్. ఆయన ఒక్కడే చేస్తే పర్లేదు ఆయన పక్కన దివంగత రాజకీయ నేత కూతురు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి కూడా పక్కన ఉంది. దీంతో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం ఇప్పుడు అటు రాజకీయాల్లో ఇటు సినీ వర్గాలలోను జోరుగా వినిపిస్తుంది. అయితే ఈ పెళ్లి విషయంపై ఇప్పటికే మంచు మనోజ్ ని అడగ్గా..నో కామెంట్ అంటూ స్పందించారు .

అంతేకాదు టైం వచ్చినప్పుడు అన్ని వివరాలు నేనే చెబుతాను అని ఆయన పేర్కొన్నాడు. దీంతో కచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పెళ్లి ముహూర్తం పెట్టుకోగానే మంచి మనోజ్ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్తారని అంటున్నారు. కాగా మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి నీ ప్రేమ వివాహం చేసుకున్నారు . పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నా ఏవో కారణాల చేత 2019లో విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు. అప్పటి నుంచి మంచు మనోజ్ సింగిల్ గానే ఉన్నారు. మరి చూడాలి భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ పెళ్లి వార్తలు ఎంతవరకు వెళ్తాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news