Moviesమంచు లక్ష్మీకి తప్పని కాస్టింగ్ కౌచ్ తిప్పలు... ఆమెను అంతలా వేధించింది...

మంచు లక్ష్మీకి తప్పని కాస్టింగ్ కౌచ్ తిప్పలు… ఆమెను అంతలా వేధించింది ఎవ‌రు..?

మోహన్ బాబు నట వారసురాలిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి. మొదట మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాతనే టాలీవుడ్ లో నటిగా పరిచయం అయ్యింది. మొట్టమొదటి సారి సిద్దార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మంచు లక్ష్మి నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించింది. నెగిటివ్ పాత్రలతో పాటూ హీరోయిన్ గా కూడా నటించి అలరించింది. గుండెల్లో గోదావరి సినిమాను నిర్మించడం తో పాటూ అందులో హీరోయిన్ గా సైతం నటించి అలరించింది. అంత‌కంటే ముందు ఆమె అన‌గ‌న‌గా ఓ ధీరుడు సినిమాలో లేడీ విల‌న్‌గా న‌టించి మెప్పించింది.

ఆ న‌ట‌న‌ను చూసిన వాళ్లంతా వామ్మో మంచు ల‌క్ష్మిలో ఇంత టాలెంట్ ఉందా ? అని ఆశ్చ‌ర్య‌పోయారు.
ఆ తరవాత మంచు లక్ష్మి చాలా సినిమాల్లోనే నటించింది. అయితే కమర్షియల్ గా మాత్రం నటిగా ఇప్పటికీ సరైన హిట్ పడలేదు అనే చెప్పాలి. అంతే కాకుండా బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం మొదట తననే అడిగారని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. కానీ ప్రభాస్ తల్లి అవ్వడంతో ఆ పాత్ర తాను రిజెక్ట్ చేశానని చెప్పింది.

ఇక ప్రస్తుతం మంచు లక్ష్మి అడపా దడపా సినిమాలు చేస్తూ మరోవైపు యూట్యూబ్ వీడియో కు సైతం చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఇక బుల్లితెర మీద కూడా ప‌లు షోలు చేస్తూ ఎప్పుడూ సంద‌డి చేస్తూ ఉంటుంది. దాంతో సోషల్ మీడియాలో మంచు లక్ష్మీకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

ప్పుడు ఎవ్వ‌రూ కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులు అని చెప్పుకునేందుకు భ‌య‌ప‌డ‌డం లేదు.. సిగ్గుప‌డ‌డ‌మే లేదు. అయితే ఒకప్పటి స్టార్ హీరో కూతురు అయిన మంచు లక్ష్మి కూడా తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలు అని చెప్పింది. గతం లో ఓ ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చినా బాడీ షేమింగ్… కాస్టింగ్ కౌచ్ ను తాను ఫేస్ చేశానని చెప్పింది.

Manchu Lakshmi: I Had To Sell Kidney To Buy Flight Ticket - Sakshi

ఇప్పటికీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నా….నా శరీర ఆకృతి కర్వ్డ్ గా ఉండటం వల్ల బాడీ షేమింగ్ కు గురయ్యా అని తెలిపింది. మంచు లక్ష్మి గతంలో అప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలతో వామ్మో మోహ‌న్‌బాబు కుమార్తెకు కూడా కాస్టింగ్ కౌచ్ బాధ‌లు త‌ప్ప‌లేదా ? అని ముక్కున వేలేసుకున్నారు. ఆమె ఈ వ్యాఖ్య‌లుచేయ‌డంతో మోహన్ బాబు కుమార్తెనే అలా ఇబ్బంది పెట్టింది ఎవరు ? అంత ధైర్యం ఎవరికి ? ఉందని సోషల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news