Moviesనాకు ఆ అవకాశం వస్తే మళ్లీ అక్కడికి వెళ్లిపోతాను..అమల సంచలన వ్యాఖ్యలు..!!

నాకు ఆ అవకాశం వస్తే మళ్లీ అక్కడికి వెళ్లిపోతాను..అమల సంచలన వ్యాఖ్యలు..!!

అమల ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జంతువుల సమ్రక్షణ. ఎస్ ఆమె ఓ జంతు ప్రేమకురాలు. నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకోక ముందు నుంచి కూడా అమలకు జంతువులంటే చాలా ఇష్టం .అక్కినేని ఇంటి కోడలుగా అమల ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ ..జంతువులని బాధపెట్టినా.. వాటికి హాని కలిగించిన అమల విరుచుకుపడుతుంది అని బాగా పాపులర్ అయింది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది జంతు ప్రేమికులు ఉన్నారు కానీ అమలానే ఎందుకు పాపులర్ అయింది అనేదానికి కారణం ఆమె జంతువుల పట్ల చూపించే ప్రేమ కేరింగ్ అన్ని అని చెప్పొచ్చు.

కాగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేస్తున్న అమల.. నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హీరోయిన్ గా చేయడం మానేసింది. పూర్తిగా సినీ ఇండస్ట్రీకు దూరమైంది. ఆ తర్వాత అఖిల్ పుట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్తకు బిజినెస్ లో సహాయం చేస్తూ టైం గడుపుతుంది. అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా మళ్ళీ తన రీఎంట్రీని ప్లాన్ చేసింది . ఆ సినిమాలో అమల క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. మంచి గుర్తింపు తీసుకొచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత ఓ వెబ్ సిరీస్ లో ..మూడు హిందీ సినిమాల్లో.. రెండు మలయాళం సినిమాల్లో నటించింది. కాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత అమల తెలుగులో చేసిన సినిమా “ఒకే ఒక జీవితం”. శర్వానంద్ లీడ్ పాత్ర పోషించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అమల కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ ఆయన సందర్భంగా అమల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

ఈ క్రమంలోనే అమలా మాట్లాడుతూ..” ఈ చిత్రంలోలా టైం మిషన్ లోకి కి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను “అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది . అంతేకాదు..” ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని.. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హగ్ చేసుకుని ఏడ్చేసిందని” చెప్పుకొచ్చింది. ఇక నాగార్జున గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..” తను నా సక్సెస్ లో ఎప్పుడు భాగమై ఉంటారు”. ఈ క్రమంలోనే యాంకర్ “నాగార్జునతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారా..?” అని అడగ్గా..” మేము ఇంట్లో కలిసే ఉంటాం. మళ్ళీ స్క్రీన్ పై కూడా నా.. వొద్దు” అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది. ప్రజెంట్ అమల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news