Moviesఆయనను చూసి బుద్ధి తెచ్చుకోండ్రా..హీరోలపై బండ్లా ఘాటు వ్యాఖ్యలు..!!

ఆయనను చూసి బుద్ధి తెచ్చుకోండ్రా..హీరోలపై బండ్లా ఘాటు వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి ఉన్న పేరు గురించి ..క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . ఆయన ఓ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద మాట్లాడడంలో మన తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా అది అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పూరి జగన్నాథ్ ను బండ్ల గణేష్ ఏకిపారేసిన సంగతి తెలిసిందే . “నీకు నీ కొడుకు కన్నా.. పక్క హీరోల జీవితమే ముఖ్యమా..? వదిన ని బాగా చూసుకో ..పవిత్రను ఆకాశ్ ను సెటిల్ చెయ్యి..” అంటూ అడిగి కడిగిపారేశాడు.

Image

బండ్ల గణేష్ చేసిన రీసెంట్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఫ్యాన్ ..కాదు కాదు భక్తుడు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందరూ ఏంటి ఆయన కూడా చెప్పాడు ..పవన్ కళ్యాణ్ నా దేవుడు అని ..అంత ఇష్టం పవన్ అంటే బండ్లకు”. అయితే రీసెంట్ గా బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల పై చేసిన ఘాటు కామెంట్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

అసలు విషయం ఏంటంటే.. ఓ ఈవెంట్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు అడవి శేషు , సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు అక్కడ పెద్దవాళ్ళు ఉన్నా కానీ కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నారు. అయితే ఈ విషయం గమనించిన బండ్ల గణేష్ ఆ ఫోటోను ..దాంతోపాటు వేరే ఫంక్షన్ లో వినియంగా కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ ..ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ చేస్తూ..” నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర ..దయచేసి నేర్చుకోండి.. ఆచరించండి..” ఇది మన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి తీసుకొచ్చాడు .దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ మాత్రం సెన్స్ ఉండాలిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. హీరోలు ఎంత క్యాజువల్ గా ఉండటానికి అలా కూర్చున్న నలుగురులో మీడియా ముందు అలా పద్ధతి లేకుండా బిహేవ్ చేయడం తప్పు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news