Moviesమహేశ్ బాబు సినిమా కోసం చెత్త టైటిల్..మండిపడుతున్న ఫ్యాన్స్..!?

మహేశ్ బాబు సినిమా కోసం చెత్త టైటిల్..మండిపడుతున్న ఫ్యాన్స్..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకున్న క్రేజ్ ..తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు కళ్ళు పైకెత్తి చూస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే పడిపోవాల్సిందే. అంత క్రేజీయస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు.. రీసెంట్ గా సర్కారీ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు తన తదుపరి సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే లానే సెట్ చేసుకున్నారు.

ప్రజెంట్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో ప్రారంభమైనా.. అనుకోని కారణాలవల్ల కొన్ని అడ్డంకుల వల్ల సినిమా షూటింగ్ ఆగి ఆగి ఆగి రెండు రోజుల క్రితమే మొదలైంది. దీంతో మహేష్ బాబు లుక్స్ వైరల్ గా మారాయి. కాగా సినిమా షూటింగ్ అవ్వగానే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా రీసెంట్ గా షూటింగ్స్ స్పాట్ దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నాడట . అయితే ఈ టైటిల్ పై కొందరు అభిమానులు గుర్రుగా ఉన్నారు. దానికి కారణం గతంలో మహేష్ బాబు నటించిన అర్జున్ మూవీ. ఆ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో మనకు తెలిసిందే. మరి అలాంటి బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే మహేష్ బాబు కెరీర్ కి ఈ సినిమా మైనస్ గా మారుతుంది. అసలే సినిమాపై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ ..మరి ఇలాంటి టైంలో త్రివిక్రమ్ టైటిల్ విషయంలో ఇంత నెగ్లెజెన్సీగా ఉండడం కరెక్టేనా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు .”అంతేకాదు అంత పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి టైటిల్ పెడతావ్ ఏంటి ..?”అంటూ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. మరి చూడాలి మహేష్ త్రివిక్రమ్ ఏం చేస్తారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news