Moviesబాల‌య్య చేసిన ప‌నితో షాక్ అయిన స‌ప్త‌గిరి ఏం చేశాడో చూడండి......

బాల‌య్య చేసిన ప‌నితో షాక్ అయిన స‌ప్త‌గిరి ఏం చేశాడో చూడండి… అంతా నవ్వులే ( వీడియో)

నంద‌మూరి న‌ట‌సింహం అఖండ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్‌లో 107వ సినిమాలో న‌టిస్తున్నాడు. అటు మ‌లినేని గోపీచంద్ ర‌వితేజ‌తో క్రాక్ లాంటి మాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి ఇప్పుడు ఏకంగా బాల‌య్య‌నే డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ కొట్టేశాడు. మ‌లినేని గోపీకి ఇది పెద్ద హీరో సినిమా కావ‌డంతో చాలా ప్లానింగ్‌తో పాటు ఎలాగైనా హిట్ కొట్టి స్టార్ డైరెక్ట‌ర్ల లీగ్‌లో చేరాల‌ని క‌సితో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది.

 

బాల‌య్య‌కు జోడీగా అందాల తార శృతీహాస‌న్ న‌టిస్తోన్న ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్‌లో జ‌రుగుతోంది. అయితే షూటింగ్‌లో ఓ కామెడీ సంఘ‌ట‌న జ‌ర‌గ‌గా ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. షూటింగ్‌లో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ స‌ప్తగిరి బాల‌య్య‌ను ఆయ‌న ముందే ఇమిటేట్ చేసేందుకు ట్రై చేశాడు. బాల‌య్య స్టైల్లో ఓ పెద్ద డైలాగ్‌ను ఆయ‌న్ను అనుక‌రిస్తూనే చెప్పాడు.

స‌ప్త‌గిరి యాక్టింగ్‌కు ఫిదా అయిపోయిన బాల‌య్య స‌ర‌దాగా స‌ప్త‌గిరి కాళ్లు ప‌ట్టుకునేందుకు ట్రై చేశారు. వెంట‌నే స‌ప్త‌గిరితో పాటు అక్క‌డున్న వారంతా షాక్ అయిపోయారు. షాక్ అయిన స‌ప్త‌గిరి కింద‌ప‌డి బాల‌య్య కాళ్లు ప‌ట్టుకునేందుకు ట్రై చేస్తూ న‌వ్వ‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంద‌రిని న‌వ్వులు పూయిస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news